ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటను రద్దు.. కారణం కరోనానే!

ABN, First Publish Date - 2021-04-20T11:37:01+05:30

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. బ్రిటన్‌, భారత ప్రభుత్వాల తరఫున ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ఆయన ఈనెల 26న భారత్‌లో పర్యటించాల్సి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. బ్రిటన్‌, భారత ప్రభుత్వాల తరఫున ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ఆయన ఈనెల 26న భారత్‌లో పర్యటించాల్సి ఉంది. బోరిస్‌ జనవరి 26న గణతంత్ర వేడుకలకే రావాల్సి ఉంది. అప్పట్లో కూడా కరోనాకేసుల వల్లే పర్యటనను ఏప్రిల్‌కు వాయిదా వేసుకున్నారు.


అయితే.. ఈ నెలలోనే యూకే-భారత్‌ భాగస్వామ్యంపై మోదీ, జాన్సన్‌ చర్చిస్తారని.. ఆ తర్వా త కూడా తరచూ మాట్లాడుకుంటారని, ఈ ఏడాదిలోనే ఇద్దరూ నేరుగా సమావేశమవుతారని బ్రిటన్‌ పీఎంవో ప్రకటన విడుదల చేసింది. కాగా.. జూన్‌లో జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఆయన వెళ్తే బోరిస్‌ జాన్సన్‌, మోదీ ముఖాముఖి భేటీ జరిపే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-20T11:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising