ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యం‌లో కరోనా విలయం.. ఒక్కరోజే 4వేల మరణాలు!

ABN, First Publish Date - 2021-02-05T21:28:13+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కొద్ది వారాల క్రితంతో పోల్చితే.. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినప్పటికీ యూఎస్‌లో కొవిడ్ మరణాల సంఖ్యకు బ్రే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొద్ది వారాల క్రితంతో పోల్చితే.. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినప్పటికీ యూఎస్‌లో కొవిడ్ మరణాల సంఖ్యకు బ్రేకులు పడటం లేదు. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొవిడ్-19 కరాళ నృత్యం చేస్తుండటంతో నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఒక్కరోజే అమెరికాలో 3,912 మంది.. మహమ్మారి బారినపడి మరణించారు. దీంతో అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4.50లక్షలు దాటింది.


ఈ క్రమంలో వైద్య నిపుణులు స్పందిస్తూ.. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం వల్లే రికార్డు స్థాయిలో కొవిడ్ మరణాలు నమోదైతున్నట్టు చెప్పారు. వచ్చే వారంకల్లా మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతుందని తెలిపారు. కరోనా నిబంధనలను పాటించాలని, పార్టీలను, సమావేశాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా.. కొవిడ్ విలయం సృష్టిస్తున్న రాష్ట్రాల జాబితాలో కాలిఫోర్నియా ప్రథమ స్థానంలో ఉంది. గత కొద్ది వారాలుగా కాలిఫోర్నియాలో 500పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. 


Updated Date - 2021-02-05T21:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising