ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాసరి తర్వాత సినీ పెద్దను నేనే అని ఎవరైనా ప్రకటించుకుంటే..

ABN, First Publish Date - 2021-10-03T05:30:00+05:30

సినిమా తెరపైన మనం కనిపించగానే జనం ‘అబ్బో! మనం వీణ్ణి చూడలేంరా బాబో!’ అనకముందే తప్పుకోవాలన్నదే తన అభిప్రాయమని మంచు మోహన్ బాబు చెబుతున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి మంచి పాత్ర వచ్చినప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇప్పుడు సినిమా పెద్దలు ఎవరూ లేరు. దాసరిగారితోనే అది పోయింది. 
  • విష్ణు గెలవడం తథ్యం.. సోదరుడు బాలకృష్ణ కూడా సపోర్టు చేశారు
  • సినిమా స్టార్‌ల దగ్గర డబ్బులు లేవంటే నమ్మకూడదు. 
  • చిరంజీవి ప్రకాశ్‌రాజ్‌ని స్పాన్సర్‌ చేస్తున్నారని మీకు చెప్పారా..?
  • ఒకసారి చూద్దాం.. అని జగన్ కు సపోర్ట్ చేశా.. ఏదీ ఆశించలేదు
  • ముఖ్యమంత్రి జగన్‌ను కొంతమంది ఐఏఎస్‌లు అడ్డదారి పట్టిస్తున్నారు
  • ఒకరోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ల పేర్లు కూడా బయటపెడతా.
  • చంద్రబాబు డిడ్‌ ఏ మిస్టేక్‌. ఫీజులివ్వలేదు. ఎన్నోసార్లు ఫోన్లు చేశాం.
  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు


సినిమా తెరపైన మనం కనిపించగానే జనం ‘అబ్బో! మనం వీణ్ణి చూడలేంరా బాబో!’ అనకముందే తప్పుకోవాలన్నదే తన అభిప్రాయమని మంచు మోహన్ బాబు చెబుతున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి మంచి పాత్ర వచ్చినప్పుడు చేస్తున్నానంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పే ఆలోచనే లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటున్న ఆయన.. సమయం వచ్చినప్పుడు వాళ్ల పేర్లను కూడా చెబుతానంటున్నారు. అన్నీ సజావుగా జరిగి ఉంటే మా ఎన్నికల్లో విష్ణు గెలుపు కోసం చిరంజీవిని ఇంటికెళ్లి మరీ కలిసేవాడినంటున్నారు. రాజకీయాల గురించి, సినీ ఇండస్ట్రీ గురించి చాలా విషయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారాయన. 03-10-2021న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని మంచు మోహన్ బాబు చెప్పిన విషయాలు ఇవీ..


ఆర్కే : వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌. మిమ్మల్ని ఏమని అనాలి. సోదరా అనాలా... మోహన్‌బాబు గారు అనాలా.. మహానటుడు అనాలా?

మోహన్‌బాబు : మీ మనసుకు ఎలా తోస్తే అలా అను.


ఆర్కే : సోదరా అంటాను. నువ్వు సహజనటుడివే కదా!

మోహన్‌బాబు : మీరన్నారు కదా! అదే కాంప్లిమెంట్‌.


ఆర్కే : ఎలా ఉంది ఇప్పుడు జీవితం. చాలా ఏళ్ల తరువాత కలిశాం...

మోహన్‌బాబు : జీవితం గురించి ఏం చెబుతాం బ్రదర్‌. ఆల్‌ రెడీ దేవుడు ఏవిధంగా రాసిపెట్టి ఉంటాడో ఆ విధంగానే జరుగుతుంది. నేను యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు, సినిమాల్లో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా పరుగెత్తుతున్నప్పుడు సరిలేరు నాకెవ్వరూ అన్నట్టుగా ఉండేది. ఒక్క ఫెయిల్యూర్‌ వస్తే ఇంటికొచ్చిన కార్లన్నీ మాయమైపోతాయని తరువాత అర్థమయింది. ఒక్కసినిమా హిట్టయితే నెక్ట్స్‌ సినిమా కూడా సిల్వర్‌ జూబ్లీ అన్నాను. అది సూపర్‌ ప్లాఫ్‌ అయింది. జీవితంలో సూపర్‌హిట్స్‌ వచ్చాయి, ఫెయిల్యూర్‌ వచ్చాయి. 


ఆర్కే : అది సహజమే కదా!

మోహన్‌బాబు : అన్నీ సక్సెస్‌ అయితే ఒక బంగారు కుర్చీ వెంట తెచ్చుకునే వాణ్ణి కదా! సక్సెస్‌ ఉన్నప్పుడు కన్నూ మిన్నూ తెలిసేది కాదు. తరువాత తెలిసొచ్చింది. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. ‘నిన్న జరిగింది మరిచిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపటి గురించి ఆలోచించను’ అని. ఈ మధ్య ఒక ఆశ్రమానికి వెళ్లొచ్చా. నిన్న జరిగింది మరిచిపోను అనేది సినిమా డైలాగ్‌. కానీ జీవితంలో నిన్న జరిగింది మరిచిపోవాల్సిందే. ఆ లగేజ్‌ ఎందుకు? ఈ రోజు సంగతి ఆలోచించాలి. నిజజీవితంలో చాలామంది జరిగింది మరిచిపోకుండా రాగద్వేషాలు పెట్టుకుని ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు.


ఆర్కే : ఇంతకాలానికి తత్వం బోధపడింది. అంతేనా!

మోహన్‌బాబు : ఒక విధంగా... మా గురువు దాసరి నారాయణరావుగారు ఒక మాట రాశారు. బండి చక్రం ఆకులపై ఒకదానిపై కష్టం, మరొకదానిపై సుఖం... రాసుకుంటే చక్రం తిరుగుతుంటే కష్టం, సుఖం వెంట వెంటే వస్తుంటాయి. జీవితమనే నాటకంలో అది నాతో చెప్పించాడు. 


ఆర్కే : సీమ టపాకాయలా పేలే మోహన్‌బాబులో ఇంత వేదాంతం ఎలా వచ్చింది? బాగా దెబ్బలు తగిలాయా?

మోహన్‌బాబు : తగిలాయి. తగులుతున్నాయి. 


ఆర్కే : నవ్వులు...

మోహన్‌బాబు : మీరు హ్యాప్పీగా నవ్వుతున్నారు. నేను నవ్వలేకపోతున్నాను. లోపల ఉన్న బాధ నవ్వనీయడం లేదు.


ఆర్కే : ఒరిజనల్‌గా ఉండే  మోహన్‌బాబును కుంగదీసింది...

మోహన్‌బాబు : అవును.


ఆర్కే : మోహన్‌బాబు అంటే లెక్కాపక్కా లేకుండా, చిచ్చరపిడుగులా ఉండేవాడు. జీవితాన్ని అలా గడిపేశాడు. అంతేనా...

మోహన్‌బాబు : అంతే. ఎవ్వరికీ అన్యాయం చేయకుండా..


ఆర్కే : నేను ఆ పదం వాడలేదే...

మోహన్‌బాబు : మీరు అనలేదు కానీ నేను చెబుతున్నాను. 


ఆర్కే : ఆర్థిక సమస్యలా.. లేక...

మోహన్‌బాబు : ఆర్థిక సమస్యలతో కుంగిపోవడం లేదు కానీ ఆర్థిక సమస్యలు వచ్చేటట్టు చేసిన వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాను. జీవితంలో ఒడుదొడుకులు ఓకే! సినిమా సక్సెస్‌ ఫెయిల్యూర్‌ ఓకే! భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో పిల్లలందరూ బాగున్నారు ఓకే! 


ఆర్కే : మనుషులు సృష్టించిన కష్టాలు అవి...అంతేనా!

మోహన్‌బాబు : మా జీవితాల మీద దెబ్బకొట్టారు. 


ఆర్కే : సినిమా జీవితమా? వ్యాపార జీవితమా?

మోహన్‌బాబు : సినిమా జీవితంపైన దెబ్బకొట్టడం ఎవ్వరి వల్లా కాదు. ఒక్క దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. 


ఆర్కే : మీ వ్యాపారం అంటే విద్యాసంస్థలు. నాకు తెలిసి మీకున్న వ్యాపారం అదే కదా!

మోహన్‌బాబు : అంతే.


ఆర్కే : ఆంధ్రప్రదేశ్‌లో మీరు కోరుకున్న, మీ దగ్గరి బంధువు ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు టిటిడి చైర్మన్‌ అవుతారని చాలా మంది అనుకున్నారు. అది పాయే! తీరాచూస్తే కాలేజీ గురించి గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఎందుకు?

మోహన్‌బాబు : ఒకటి తప్పు మాట్లాడారు. నాకు చంద్రబాబు బంధువే. ఇతనూ బంధువే. మా అన్నయ్య రామారావును ఎలా ఇష్టపడతానో, రాజశేఖర్‌ రెడ్డిని కూడా అలాగే ఇష్టపడే వాణ్ణి. చంద్రబాబుకు ప్రచారం చేశాం. అప్పుడూ ఏం అడగలేదు. ఈయనకూ ఒకసారి సపోర్టు చేద్దాం అని హృదయపూర్వకంగా చేశాం. మీరు ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను ఏదీ ఆశించి చేయలేదు. ఇది వాస్తవం. ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది. ఒకసారి కలిశాను అయిపోయింది. నేను ఏదీ ఆశించలేదు అని ఏడుకొండల వాడికి తెలుసు. ‘అది పోయింది’ అన్నారు. ఎక్కడికిపోయింది? వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారు. అది వాళ్లిష్టం. ముఖ్యమంత్రి ఇష్టం. 


ఆర్కే : ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీ ప్రమాణాలతో సంబంధం లేకుండా ఇష్టమైన వాళ్లకు ఫీజులు పెంచారు, ఇష్టం లేని వాళ్లకు ఫీజులు తగ్గిచ్చారు. దానివల్ల విద్యాసంస్థలన్నీ కుదేలవుతున్నాయి. అదే కదా సమస్య? ఆ సంస్థల్లో మీ విద్యానికేతన్‌ కూడా ఉంది. అవునా?

మోహన్‌బాబు : చెప్పండి.


ఆర్కే : ఎందుకలా బిక్కముఖం పెట్టారు?

మోహన్‌బాబు : బిక్కముఖం కాదు. మీరు నన్ను ఇబ్బందికరమైన విషయాలు అడగను అని అన్నారు. మీరు అడిగిన దానికి ఒక విధంగా సమాధానం చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్‌ను కొంతమంది ఐఏఎస్‌లు అడ్డదారి పట్టిస్తున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చదివిన్న  వాళ్లందరూ మేధావులు కారు. విద్యాసంస్థల విషయంలో కొంతమంది ఐఏఎస్‌లు రాంగ్‌ డైరెక్షన్‌ ఇవ్వడం వల్ల హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ దెబ్బతిన్న మాట వాస్తవం. 


ఆర్కే : మీరు చెప్పే మాట ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంది. జగన్‌మోహన్‌రెడ్డిని తప్పుదారి పట్టించడమా? జగన్‌మోహన్‌రెడ్డి ఎవరిమాటైనా వినడమా? 

మోహన్‌బాబు : జగన్‌మోహన్‌రెడ్డి వినడని మీకు ఎవరు చెప్పారు.


ఆర్కే : నూటయాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా? వారిలో ఎవరిని అడిగినా చెబుతారు...

మోహన్‌బాబు : నేనెందుకు అడగాలి.


ఆర్కే : అక్కడి వాళ్లను ఎవ్వరిని అడిగినా మాకు ముఖ్యమంత్రి దర్శనమే దొరకదు. ఒకవేళ దొరికినా ఆయన చెప్పింది విని రావడమే కానీ మేం చెప్పేది ఏమీ ఉండదు అని అంటారు.

మోహన్‌బాబు : అటు వెళ్లలేదు. వెళ్లదలుచుకోలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాం. అయ్యాడు. 


ఆర్కే : మీకు నష్టమైతే జరిగింది అన్న మాటనైనా ఒప్పుకోగలరా? 

మోహన్‌బాబు : ఏ విషయంలో...


ఆర్కే : మీ విద్యాసంస్థలకు న్యాయంగా నిర్ణయించాల్సిన ఫీజులను నిర్ణయించలేదు అని...

మోహన్‌బాబు : వాస్తవం. 


ఆర్కే : ఇంకొకటి బకాయిలు..

మోహన్‌బాబు : బకాయిలు ఇస్తున్నారు. మీరు చంద్రబాబు మనిషా?


ఆర్కే : నేను ఎవ్వరి మనిషిని కాదు. ఆ మాటలు విని వినీ విసుగొచ్చింది. 

మోహన్‌బాబు : మరి ఎంతసేపు జగన్‌మోహన్‌రెడ్డి టాపిక్‌ ఎందుకు తీస్తున్నారు?


ఆర్కే : పులివెందులలో నాకు, జగన్‌మోహన్‌రెడ్డికి గట్టు పంచాయితీ ఉంది. 

మోహన్‌బాబు : అది వేరు. నాకు సంబంధం లేదు.


ఆర్కే : లేకపోతే ఏంటి? నాకు బంధుత్వం లేదు. ఏదీ లేదు. మేం తెలంగాణ వాళ్లం. ఎక్కువ మాట్లాడబోకండి..

మోహన్‌బాబు : నటుడనే వాడు రెండురాష్ట్రాలకు సంబంధించిన వాడు. 


ఆర్కే : నేననేది ఏంటంటే మోహన్‌బాబు అవుట్‌స్పోకెన్‌...

మోహన్‌బాబు : యస్‌. నో డౌట్‌.


ఆర్కే : చంద్రబాబు హయాంలో ఫీజుల చెల్లింపుల విషయంలో జాప్యం జరిగినప్పుడు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేశారా? లేదా?

మోహన్‌బాబు : వాస్తవం.


ఆర్కే : విద్యాసంస్థ అధిపతిగా అది మీ హక్కు. కానీ ఇప్పుడు అన్నీ మూసుకుని ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది?

మోహన్‌బాబు : ఎవరు?


ఆర్కే : మీరని కాదు. మొత్తంగా... అందరికీ ముఖ్యమంత్రి అంటే భయమైతే ఉంది?

మోహన్‌బాబు : నో నెవర్‌! జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాలను గడ్డిపరకలా చూస్తాడు. ఐ లవ్‌ హిమ్‌. ఐ రెస్పెక్ట్‌ హిమ్‌. ఎవడి మోచేతి నీళ్లయినా తాగుతున్నామా భయపడటానికి! చంద్రబాబు డిడ్‌ ఏ మిస్టేక్‌. ఫీజులివ్వలేదు. ఎన్నోసార్లు ఫోన్లు చేశాం. ఇది వాస్తవం. బ్యాంకులకు డబ్బులు కట్టాలి. రెండు వేల మంది టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌. వాళ్లందరికీ జీతాలు ఇవ్వాలి. రెండు రాష్ట్రాల్లో వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ కాలేజ్‌ మాది. ప్రధానిని కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్పా. ఆయన నన్ను బడా భయ్యా అని పిలుస్తారు. నేను నో సార్‌ అన్నాను చనువుగా.


ఆర్కే : అమితాబ్‌ లాంటి రోల్స్‌ చేయొచ్చు కదా?

మోహన్‌బాబు : చేస్తున్నాను. సన్నాఫ్‌ ఇండియాలో డ్యూయెట్స్‌ లేవు. ఆ విషయం పక్కన పెడితే భయపడటం నా డిక్షనరీలో లేదు. నాకు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గొడవ పెట్టాలని చూస్తున్నారా? ఆయనకు నాకు పర్సనల్‌గా ఏమీ లేదు. కాలేజీల వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అది తప్పని చెప్పాం. కంప్లీట్‌ రాంగ్‌ రూట్‌లో తీసుకెళుతున్న వారు కొంత మంది ఐఏఎస్‌ ఆఫీసర్లు. ఒకరోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ల పేర్లు కూడా బయటపెడతా.


ఆర్కే : ఇప్పుడు సంధా, పోరాటమా?

మోహన్‌బాబు : జగన్‌ మీద పోరాటం చేయమని రెచ్చగొట్టి పంపిస్తే నేను చేయను. పాలిటిక్స్‌కు ఓ నమస్కారం. 


ఆర్కే : ఇక పాలిటిక్స్‌ జోలికి వెళ్లరా?

మోహన్‌బాబు : 99 పర్సెంట్‌. 


ఆర్కే : ఆ ఒక్క పర్సెంట్‌ ఎందుకు?

మోహన్‌బాబు :  ప్రధానిని కలిసినప్పుడు భోజనం చేస్తున్న సమయంలో అడిగా. నన్ను ఎందుకు పిలిచారు? అని సరదాగా అడిగా. అప్పుడాయన ‘భయ్యా దిసీస్‌ యువర్‌ హౌజ్‌. ఎనీ టైమ్‌ వెల్‌కం’ అన్నారు. అంత ప్రేమగా ఆహ్వానించారు. అందుకని వన్‌ పర్సెంట్‌ ఏమో అంటున్నాను. ఐ లవ్‌ హిమ్‌, ఐ లైక్‌ హిమ్‌.


ఆర్కే : నటుడిగా 47 ఏళ్లు అయింది కదా! మీ ఫ్రెండ్‌ చంద్రబాబును 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటుంటారు...

మోహన్‌బాబు : చంద్రబాబుకు ఉన్న తెలివితేటలు నాకు లేవు.


ఆర్కే : మీది పాము, ముంగీస వ్యవహారం. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్లీ ముద్దులెట్టుకుంటారు. మీ చిత్తూరు జిల్లా వాళ్లను...

మోహన్‌బాబు : మీ జిల్లా వాళ్లను నమ్మాల్నా?


ఆర్కే : ఎనీ డే... తెలంగాణ వాళ్లను నమ్మొచ్చు.

మోహన్‌బాబు : నో డౌట్‌. మరి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడండి? అందరూ చంద్రబాబులా ఎలా ఉంటారు? చంద్రబాబు కనిపిస్తే మాట్లాడుకుంటాం. అందులో ఏముంది?


ఆర్కే : నేనూ అదే అంటున్నాను. మీరిద్దరూ ఏదో సందర్భంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది అని అంటున్నాను.

మోహన్‌బాబు : ఏంది కలిసిపోయేది?



చిరంజీవి అలా అడిగి ఉంటే వెంటనే విష్ణును విత్‌డ్రా చేసుకొమ్మని చెప్పే వాణ్ణి... ఇంటర్వ్యూ పార్ట్-2 కోసం క్లిక్ చేయండి



Updated Date - 2021-10-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising