ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకంటే మంచి నటులు వస్తున్నారన్న మాటను నేనొప్పుకోను

ABN, First Publish Date - 2021-10-04T06:01:06+05:30

సినిమా పరిశ్రమ చాలా భయాందోళనస్థితిలో ఉంది. నీ ఫుడ్‌ ఏంటయ్యా మనం చేసే వ్యాపారం. ఆ వ్యాపారం కళామతల్లి. కరోనా మూలంగా ఆ వ్యాపారం చాలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్కే : ఫ్రెండ్స్‌గా...

మోహన్‌బాబు : మళ్లీ ద్వంద్వార్థం. మా జాతకాల మీద దెబ్బకొడుతున్నారా?


ఆర్కే : రాజకీయంగా కాదు.. ఫ్రెండ్స్‌గా ఎప్పుడైనా కలుసుకోవచ్చు కదా!

మోహన్‌బాబు : తప్పులేదు.


ఆర్కే : 47 సంవత్సరాల కెరీర్‌లో క్లిష్టమైన సమయం ఇదేనా? ఇలాంటి గడ్డుపరిస్థితులు ఇంతకు ముందు కూడా ఎదుర్కొన్నారా?

మోహన్‌బాబు : నటుడిగానా...రాజకీయంగానా..?


ఆర్కే : నటుడిగా...?

మోహన్‌బాబు : సినిమా పరిశ్రమ చాలా భయాందోళనస్థితిలో ఉంది. నీ ఫుడ్‌ ఏంటయ్యా మనం చేసే వ్యాపారం. ఆ వ్యాపారం కళామతల్లి. కరోనా మూలంగా ఆ వ్యాపారం చాలా దెబ్బతింది. నాకు సినిమా, విద్యాసంస్థలు రెండూ ఉన్నాయి. ఈ రెండింటిని కరోనా దెబ్బకొట్టింది. థియేటర్‌లో జనం కూర్చుని సినిమా చూడటం, చప్పట్లు, విజిల్స్‌ అవన్నీ లేకుండా పోయాయి. ఒక సినిమా 25 వారాలు ఆడిన రోజులున్నాయి. ఓటీటీలో చూసేవాడు ఏం చూస్తున్నాడో, ఏది చూడట్లేదో తెలియదు. ఒక సీన్‌ చూసి, ఇంకో సీన్‌ను ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ కొట్టేస్తున్నాడు. జూనియర్‌ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు.


ఆర్కే : సినిమా ఇండస్ట్రీ ఉచ్చ దశను కోల్పోయినట్టేనా? భారీ బడ్జెట్‌ సినిమాలు, కోట్ల రెమ్యునరేషన్‌లు పోయినట్టేనా?

మోహన్‌బాబు : మా గురువు దాసరి నారాయణరావుగారు ఒక మాట చెప్పేవారు. ఇప్పుడు నిర్మాతలు ఎవరున్నారు మోహనా! 98 పర్సెంట్‌ నిర్మాతలు హీరోల చేతుల్లో బ్రోకర్స్‌ అయిపోయారు అని. 95 శాతం నిర్మాతలు చచ్చిపోయారు అని నేను అంటాను. నిర్మాత ఉంటేనే మాకు భోజనం దొరుకుతుంది. ఈరోజు అలాంటి నిర్మాత ఎలాంటి దీనస్థితిలో ఉన్నాడో, ఎంత దిగజారి పోయాడో తలుచుకుంటే బాధేస్తుంది. ఆడపడుచులు, ఫ్యామిలీ థియేటర్‌కు వెళితేనే సినిమా హిట్‌. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీలు ఎప్పుడు థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తాయి. వాళ్ల పరిస్థితి ఏంటి? ఇటు వీళ్ల పరిస్థితి ఏంటి? నాకు తెలిసి అంతా జీరో!


ఆర్కే : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమానే తీసుకుంటే విడుదల చేయాలో, చేయకూడదో,  చేస్తే ఏమవుతుందో పరిస్థితి తెలియకుండా ఉంది కదా!

మోహన్‌బాబు : నేను ఇతర సినిమాల గురించి మాట్లాడను. మీరు మాట్లాడొచ్చు. నేను మాట్లాడకూడదు. అంత డబ్బు పెట్టి తీసిన సినిమా బాగా ఆడాలి. థియేటర్లు లేకపోతే బాధాకరం. మీరు పెద్ద సినిమా గురించే మాట్లాడుతున్నారు. పదికోట్లు పెట్టి తీసిన వాడికైనా థియేటర్లు లేకపోతే వాడి పరిస్థితి ఏంటి? వాడికవే వందకోట్లు. పెద్దవి ఆడాలి. చిన్న సినిమాలు ఆడాలి. 


ఆర్కే : కరోనా తరువాత వెబ్‌సిరీస్‌లు పెరిగాయి. కొత్త నటులు వస్తున్నారు. మీకంటే మంచి నటులు వస్తున్నారు. ఏమంటారు?

మోహన్‌బాబు : నేను ఒప్పుకోను.


ఆర్కే : ఆ పొగరే కావాలి....సరదాగా అన్నాను. మోహన్‌బాబు రియాక్షన్‌ తెలియాలి అని అడిగా...

మోహన్‌బాబు : అహంకారం అంటారా... ఆత్మవిశ్వాసం అంటారా... మీ ఇష్టం. ఏ డైలాగ్‌ అయినా అద్భుతంగా చెప్పగలను. 


ఆర్కే : తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్‌ ఆర్టిస్టు లోటుని నువ్వు తప్పకుండా ఫిల్‌ చేయగలవని నమ్మకముంది? 

మోహన్‌బాబు : హీరోగానే చేయాలని, డ్యూయెట్లు పాడాలని నాకేం లేదు. ఈ మధ్యకాలంలో సూర్య హీరోగా వచ్చిన సినిమాలో ఒక పాత్ర చేశాను. మంచి పేరొచ్చింది. శకుంతల సినిమాలో దుర్వాసుని పాత్ర వేశాను. మంచి పాత్ర ఉండాలి. పారితోషికం ఉండాలి. విలన్‌ వేషాల్లోనే మంచి డైలాగ్‌లు పడతాయి. అన్ని హీరో పాత్రల్లో మంచి డైలాగ్‌లు పడాలని లేదు. ఒక సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. ‘తిరుపతిలో లడ్డూలు, సినిమా స్టార్‌ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు? పంపిస్తావా.. రమ్మంటావా?’ అని. 


ఆర్కే : దీన్నిబట్టి సినిమా స్టార్‌ల దగ్గర డబ్బులు లేవంటే నమ్మకూడదు. అంతేనా?

మోహన్‌బాబు : నమ్మకూడదు.


ఆర్కే : మోహన్‌బాబు దగ్గర డబ్బు లేదంటే నమ్మకూడదు?

మోహన్‌బాబు : మీ నోటి వాక్కు ఉందనుకుందాం.


ఆర్కే : ఉండాలని కోరుకుందాం.

మోహన్‌బాబు : థ్యాంక్యూ


ఆర్కే : రజనీకాంత్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ కదా! రాజకీయాల్లోకి వెళ్లే ముందు నిన్ను అడగలేదా?

మోహన్‌బాబు : అడిగాడు. నేను వద్దని చెప్పాను. నాకు తెలిసి ఇది కరెక్ట్‌ సమయం కాదు. ఆలోచించుకో మిత్రమా అని చెప్పాను. 


ఆర్కే : అంత షార్ట్‌ పీరియడ్‌లో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇమేజ్‌ దెబ్బతినలేదా?

మోహన్‌బాబు : వాడి ఆరోగ్యానికి మంచిది. దెబ్బతినకుండా బయటపడ్డాడు. 


ఆర్కే : ఫ్రెండ్‌ని సపోర్టు చేస్తున్నారా?

మోహన్‌బాబు : డెఫినెట్‌గా చేస్తాను.


ఆర్కే : బయటి రాజకీయాలకన్నా సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ‘మా’ ఎలక్షన్స్‌లో...

మోహన్‌బాబు : నీచ, నికృష్ట, దరిద్ర, భ్రష్టుత్వం పట్టిపోయింది. మా ఎలక్షన్స్‌లో తెలిసిన వాడు, తెలియని వాడు, వెధవలు కొంతమంది అదొక కిరీటం అనుకుని, అసలు క్యారెక్టర్స్‌ లేని కొంతమంది మాట్లాడుతున్నారు. పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను. విష్ణుని పోటీలో నిలబెట్టాలని ఆలోచనే లేదు. సడన్‌గా వాడు ఒకరోజు డాడీ ‘గురువుగారు కూడా అన్నారు. అప్పుడేమో మీరు వద్దన్నారు. ఉంటే బెటర్‌ కదా డాడీ’ అన్నారు. ‘కాలేజీ యూనివర్సిటీ స్థాయిలో ఉంది. యూనివర్సిటీ హోదా కూడా రావచ్చు. అది చూసుకోవాలి. సినిమాల్లో యాక్ట్‌ చేయాలి. నలుగురు బిడ్డల తండ్రివి అయ్యావు. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏకగ్రీవంగా అయితే బాగుంటుంది. కానీ ఎలక్షన్స్‌లో పోటీ చేయడం ఏంటని అనిపించి ఒకరిద్దరి ఫోన్‌ నంబర్లు ఇచ్చి మాట్లాడమన్నా. ఇప్పుడు ఇంకొకరు వచ్చారు. అది నేను ఊహించలేదు. ఇలా వస్తారు, ఈ విధంగా మాట్లాడతారు అని. 


ఆర్కే : ఎవరు? ప్రకాశ్‌రాజా?

మోహన్‌బాబు : ఐ డోన్ట్‌ వాంట్‌ టు సే హిస్‌ నేమ్‌. కొంతమంది పరిశ్రమలో నా జాతకం మీకు ఎలా తెలుసో... మీరంటే మీరు కాదు ఇక్కడ.  వాళ్లకు నా జాతకం తక్కువ తెలుసు. కానీ వాళ్ల జాతకాలు నాముందు పేజీ బై పేజీ ఉన్నాయి. కానీ ఒక పెద్దరికం, ఒక ఎడ్యుకేషనలిస్టుగా, విద్యాసంస్థల చైర్మన్‌గా నేను వాళ్ల జీవితాల గురించి మాట్లాడదలుచుకోలేదు. వాళ్లు కూడా టీవీల ముందుకొచ్చి మాట్లాడేస్తుంటే ఏముంది? మనమంతా కళామతల్లి బిడ్డలం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ఒక గ్లాస్‌హౌజ్‌లో ఉన్నట్టు. ఒక్కరు రాయి వేసినా మొత్తం స్పాయిల్‌ అవుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఎవరికి వారే గొప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడనివ్వండి. ఎయిర్‌పోర్టుకు వెళుతున్నాం. దారిలో ఎందరో మాట్లాడుతుంటారు. వాళ్లందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే ఫ్లైట్‌ మిస్సవుతుంది. సామెత ఉంది కదా! ‘మదగజంబు మార్గమున వెళుచుండ కుక్కలెన్ని మొరుగుట లేదని!’ కుక్కలు మొరుగుతుంటాయి. ప్రతి కుక్కకూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 


ఆర్కే : అంతా కలిసి సభ్యులు వెయ్యి మంది కూడా లేరు కదా! దానికి పోస్టింగ్‌లు పెట్టి నానా యాగీ చేయడం ఏంటి?

మోహన్‌బాబు : నాన్నగారు టీచర్‌. ఐదు రూపాయల జీతంతో ప్రారంభమైంది. భక్తవత్సలనాయుడు టీచర్‌. మోహన్‌బాబుగా మారాడు. 1992లో విద్యాసంస్థలు ప్రారంభించా. మార్చి 19 నా పుట్టిన రోజు. అదే రోజు ప్రారంభించాం. అబ్దుల్‌కలాం వచ్చారు. నాగేశ్వరరావుగారు వచ్చారు. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు ఎన్నోసార్లు వచ్చారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఆయన పేరు మీద ఒక లక్షరూపాయలు బెస్ట్‌ టీచర్‌కి ఇవ్వాలనుకున్నాను. రెండురాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి మాట. రాష్ట్రాలు విడిపోయిన తరువాత భారమవుతుందేమోనని 50, 50వేలు ఇచ్చాం. ఇప్పుడు కరోనా దెబ్బకి ఫంక్షన్స్‌ చేయలేదు కాబట్టి ఈ కళాకారులందరినీ పిలిచి ఒక శాలువా కప్పి, ఒక పత్రం ఇస్తున్నా నాన్నగారి పేరు మీదుగా. అది కూడా తప్పు పట్టారు. ఎలక్షన్‌ స్టంటా? అన్నారు. ఆ శాలువాకు, సర్టిఫికెట్‌కు ఒక అర్థం ఉంది. నా తండ్రిగారి పేరుమీదుగా ఇచ్చాను. నీచనికృష్టమైన కొంతమంది మానవులు దాన్ని కూడా తప్పు పట్టారు.


ఆర్కే : మీకు చిరంజీవికి పడేది కాదు. కానీ స్టేజ్‌ మీదే ముద్దులెట్టుకున్నారు? అదీ నటనే ఇదీ నటనేనా? లేకపోతే...

మోహన్‌బాబు : చిరంజీవి ఎప్పటికీ స్నేహితుడే! ఎందుకడిగారు?


ఆర్కే : మీ మధ్య ఉన్నది స్నేహ బంధమేనా?

మోహన్‌బాబు : స్నేహబంధమే. నాకు స్నేహబంధమే. 


ఆర్కే : అలాంటప్పుడు దీనికోసం ఎందుకు కొట్టుకుంటున్నారు?

మోహన్‌బాబు : ఎవరు చెప్పారు. 


ఆర్కే : చిరంజీవి ప్రకాశ్‌రాజ్‌ని స్పాన్సర్‌ చేస్తున్నారు? 

మోహన్‌బాబు : చెప్పాడా చిరంజీవి?


ఆర్కే : జగమెరిగిన సత్యం అది. నేను చెప్పాలా? మీకు తెలియదా?

మోహన్‌బాబు : ఓకే అనుకుందాం.


ఆర్కే : విష్ణుకి మోహన్‌బాబు ఫాదర్‌, గాడ్‌ఫాదర్‌?

మోహన్‌బాబు : విష్ణుబాబుకి 966 మంది సభ్యులు ఉన్నారు. వాళ్లందరూ విష్ణుకి సపోర్టు చేస్తున్నారు. 


ఆర్కే : చిరంజీవి స్నేహితుడైతే ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు కదా! ఈ సారి విష్ణుని, ఇంకోసారి ప్రకాశ్‌రాజ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అని అడగొచ్చు కదా?

మోహన్‌బాబు : అలా జరగలేదు. 


ఆర్కే : చిరంజీవి మీకు ఫోన్‌ చేసి ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తున్నాడు కాబట్టి మీరు తప్పుకొంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడని, అందుకు మీరు అంగీకరించలేదని బయట టాక్‌. నిజమా కాదా?

మోహన్‌బాబు : చిరంజీవి బిడ్డ నాకు బిడ్డ లాంటి వాడే. అరవింద్‌ పిల్లలు నా బిడ్డలాంటివారే. నాగబాబు పిల్లలూ అంతే. ఆ కుటుంబంలోని బిడ్డలెవరైనా నిలబడి ఉంటే, చిరంజీవి అలా అడిగి ఉంటే వెంటనే విష్ణును విత్‌డ్రా చేసుకొమ్మని చెప్పే వాణ్ణి. అంతేకాదు నేరుగా వెళ్లి మా చిరంజీవి అబ్బాయి, మా నాగబాబు అబ్బాయి, మా అరవింద్‌ అబ్బాయి, మా నాగార్జున అబ్బాయిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం అని సంతోషంగా చెప్పేవాణ్ణి. ఈరోజుకి, ఈ నిమిషానికి కూడా చేస్తాను. మరి అతను ప్రకాశ్‌రాజ్‌ని...


ఆర్కే : ప్రకాశ్‌రాజ్‌కి మీకు పడదా? అతడు మీకు స్నేహితుడేనా?

మోహన్‌బాబు : స్నేహితుడు కాదు. స్నేహితుడు అంటే రజనీకాంత్‌, అంబరీష్‌. కష్టసుఖాల్లో పాలుపంచుకొనేవాడు స్నేహితుడు. స్నేహితుల్లో చాలా రకాలుంటారు. మేమందరం సినిమా స్నేహితులం.


ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ట్రై చేస్తున్నారుగా.. హి కెనాట్ రీప్లేసా...? అన్న ప్రశ్నకు మోహన్ బాబు సమాధానం ఇదీ.... ఇంటర్వ్యూ పార్ట్-3 కోసం క్లిక్ చేయండి

Updated Date - 2021-10-04T06:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising