వరలక్ష్మిపై నాకు ఆ విషయంలో భయం ఉంది
ABN, First Publish Date - 2021-11-15T08:46:06+05:30
కూతురు సినిమాల్లోకి వస్తే ఒక తండ్రిగా నాకు కొన్ని భయాలు ఉండడం సహజం.
ఆర్కే: మీ అమ్మాయి నటి అయ్యారు కదా?
శరత్: అవును. భిన్న పాత్రలు పోషిస్తోంది. హీరోయిన్‌గా కంటే యాక్టర్‌గా కెరీర్‌ను మలుచుకుని మంచి పని చేసింది. యాక్టర్‌కు నటనా జీవితం ఎక్కువ. నాంది సినిమాలో చాలా బాగా నటించింది.
ఆర్కే: వరలక్ష్మిని పోత్సహించింది మీరేనా?
శరత్: నా మొదటి భార్య, రాధిక ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే తప్పేముంది అని అడిగి, సినిమాలో నటించేలా నన్ను ఒప్పించారు. వరలక్ష్మి, పూజ ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కూతురు సినిమాల్లోకి వస్తే ఒక తండ్రిగా నాకు కొన్ని భయాలు ఉండడం సహజం. అయితే ఇప్పుడు కుటుంబమంతా హ్యాపీగా ఉన్నాం.
ఆర్కే: ఆవిడ లవ్ ఎఫైర్ ఒకటి బాగా సర్క్యులేట్ అయింది కదా? మీరు రెస్పాండ్ కాలేదా?
శరత్: ఇండస్ట్రీ అలాంటిది. ఇలాంటివన్నీ పట్టించుకుంటే ఎదగలేవు. నీకు కెరీర్ ముఖ్యమా? ఇలాంటి ప్రచారాలు ముఖ్యమా? అని అడిగాను. అలాంటివన్నీ పట్టించుకునే స్థాయిని ఇప్పుడు దాటేసింది. మేమందరం విడివిడిగానే ఉంటున్నా, తరచూ కలుస్తూనే ఉంటాం. ఇప్పుడిక నా 17 ఏళ్ల కొడుకు గురించే బెంగ. వాడికి ఫుట్‌బాల్ అంటే ఆసక్తి.
ఆర్కే: మీ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ విశాల్ మీకు వ్యతిరేకం అయ్యారు కదా?
శరత్: కర్మ ప్రకారం ఏవేవో జరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకునే తత్వం నాది కాదు. పగలూ, ప్రతీకారాలు నాకు పనికి రావు.
ఆర్కే: సినిమా ఇండస్ర్టీలో కులం పెద్ద పాత్ర పోషిస్తోంది. తమ కులానికి చెందిన హీరోల సినిమాలే చూడడం లాంటి సంస్కృతి మొదలైంది. మీరేమంటారు?
శరత్: ఇది సరైన ధోరణి కాదు. వైద్యులను కలిసినప్పుడు, రక్తం ఎక్కించుకునేటప్పుడు కుల పట్టింపు ఉండనప్పుడు, మిగతా విషయాల్లో ఉండడం ఎంతవరకూ సమంజసం? భగవంతుని దృష్టిలో అందరూ సమానమే!
ఆర్కే: నడిగర్ ఎలక్షన్స్ కూడా కులం ఆధారంగా జరుగుతున్నాయా?
శరత్: అక్కడ అలాంటిదేం లేదు. నిజానికి తమిళనాడుకు చెందనివాళ్లే ఎక్కువగా గుర్తింపు పొందుతారు. అంతదాకా ఎందుకు? మా ఇంట్లో రాధిక తమిళనాడుకు చెందినది కాదు.
ఆర్కే: రాధిక చాలా డామినేటింగ్ క్యారెక్టర్. ఆవిడకు మీరు సరెండర్ అయ్యారా?
శరత్: ఆవిడ చాలా దృఢమైన వ్యక్తి. ఆమెని ఒప్పించడం చాలా కష్టం. చాలా మందికి ఆవిడ పొగరుగా కనిపిస్తుంది. కానీ నిజానికి తను చాలా సరదా మనిషి. ఆవిడ కూడా జీవితంలో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు.
ఆర్కే: ఆవిడ దగ్గర మీరు తగ్గి ఉంటారేమో!
శరత్: మీరు అంటున్నారు కాబట్టి అయి ఉండవచ్చు. ప్రతి మగాడి విజయం వెనకా ఓ ఆడది ఉంటుంది. అది రాధిక అనుకుందాం. తప్పేముంది?
ఆర్కే: మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
శరత్: నేనిప్పుడు పార్టీని సరైన దార్లో పెడుతున్నాను. సినిమాల్లో నటిస్తూనే పార్టీని నడిపిస్తాను.
ఆర్కే: డిఎంకెలో చేరే అవకాశం ఉందనుకోవాలా?
శరత్: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అయితే పూర్తి వ్యవస్థను మార్చాలనే సంకల్పం ఉంది. అది ఈ జీవితంలో సాధ్యపడుతుందో లేదో చెప్పలేను. అయితే రాజకీయాల్లో నా ముద్ర కచ్చితంగా కనిపించేలా నడుచుకుంటాను. అయితే సినిమాల్లో నటించడం మాత్రం మానుకోను. సినిమాల పట్ల ప్యాషన్ నాలో ఇంకా చనిపోలేదు. సూపర్ స్టార్‌డమ్ రావాలి అని కోరుకుంటున్నాను.
ఆర్కే: రాజకీయాల్లో కొనసాగాలనీ, సినిమాల్లో మరిన్ని మంచి క్యారెక్టర్స్ చేయాలనేది మీ కోరిక కాబట్టి, మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ... థ్యాంక్యూ సో మచ్!
శరత్: థ్యాంకూ సో మచ్ ఫర్ గివింగ్ మి దిస్ ఆపర్‌చ్యునిటీ.
Updated Date - 2021-11-15T08:46:06+05:30 IST