ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపం.. ఎందుకొచ్చిందో ఏంటో.. కరెంటు వైర్లపై పాము.. కింద జనాలను చూసి భయం.. చివరకు..

ABN, First Publish Date - 2021-09-18T22:15:38+05:30

ఆరడుగుల నాగుపాము.. జనాలను చూపి బెదిరిపోయింది. భయం భయంగా కరెంటు తీగలపై తిరుగుతూ ఆకాశంలో విన్యాసాలు చేసింది. చిట్టచివరికి వైర్లపై నుంచి భూమిపైకి వొచ్చి, బ్రతుకు జీవుడా అంటూ పరుగులుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకివ వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆరడుగుల నాగుపాము.. జనాలను చూపి బెదిరిపోయింది. భయం భయంగా కరెంటు తీగలపై తిరుగుతూ ఆకాశంలో విన్యాసాలు చేసింది. చిట్టచివరికి  వైర్లపై నుంచి భూమిపైకి వొచ్చి, బ్రతుకు జీవుడా అంటూ పరుగులుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకివ వెళితే.. 


రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న జైన మందిరానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో జైన మందిరానికి వచ్చిపోయే భక్తులతో టెంపుల్ సమీపంలోని క్రాస్ రోడ్డు రద్దీతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే.. పాపం ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో తెలియదు కానీ ఇంత రద్దీగా ఉండే రోడ్డుపైకి సుమారు ఆరు అడుగుల నాగుపాము వచ్చింది. జనాన్ని చూసి, బిత్తరపోయిన ఆ నాగుపాము.. సరాసరి కరెంట్ స్తంభాన్ని ఎక్కేసింది. అనంతరం కరెంట్ తీగలపై తిరిగి, సాయంత్రానికి దిగి వెళ్లిపోయింది. కరెంటు తీగలపై తిరుగుతున్నప్పుడు అవి ఊగడంతో వల్ల ఉయ్యాల ఊగినట్టు అనిపించిందో ఏమో కానీ.. మరుసటి మళ్లీ ఆ పాము నేరుగా కరెంటు స్తంభాన్ని ఎక్కి, తీగలపై తిరగసాగింది. 



దీంతో ఆ పాము ప్రజల కంట పడింది. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున జన సమూహం ఏర్పడింది. కాగా.. పెద్ద సంఖ్యలో జనం గుమికూడి ఉండటాన్ని గమనించిన సదరు నాగుపాము.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఈ నేపథ్యంలోనే స్థానికులు పెద్దమనసు చేసుకున్నారు. పాముకు ఎటువంటి అపాయం జరగొద్దని కరెంటు సరఫరా నిలిపివేశారు. అనంతరం ఓ కర్ర సహాయంతో.. ఆ పాము కిందకు దిగేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆ ఆరడుగుల నాగుపాము.. ఆకాశం నుంచి నేలకు చేరింది. అనంతరం స్థానికంగా ఉన్న ఇళ్లవైపు పరుగులుపెట్టి, కనబడకుండా పోయింది. ఈ దృశ్యాలను కొందరు నెట్టింట పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.


Updated Date - 2021-09-18T22:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising