ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమ్మాయిలు పడటం లేదు... నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టండి’: ఎమ్మెల్యేకు యువకుని వినతి!

ABN, First Publish Date - 2021-09-14T12:55:28+05:30

సాధారణంగా ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తీర్చాలనో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రపూర్: సాధారణంగా ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తీర్చాలనో లేదా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనో ఎమ్మెల్యేలను వేడుకుంటారు. అయితే ఒక యువకుడు తమ ప్రాంతపు ఎమ్మెల్యేను విచిత్రమైన కోరిక కోరాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు ఒక యువకుడు రాసిన ఉత్తరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూషణ్ జామువంత్ అనే యువకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ థెతెకు... తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుతూ మరాఠీ భాషలో లేఖ రాశాడు. 


తమ ప్రాంతంలో ఎందరో అమ్మాయిలు ఉన్నారని అయితే ఎవరూ తనను ఇష్టపడటం లేదని, దీంతో తనలో ఆందోళన పెరిగిపోయి, ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నదని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మందుబాబులకు, అల్లరిచిల్లరగా తిరిగేవారికి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారని, వారిని చూసినపుడు తన గుండె తరుక్కుపోతుంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఉత్తరాన్ని చూసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు గతంలో ఇటువంటి లేఖలు ఎప్పుడూ రాలేదని, అయితే ఈ భూషణ్ జామువంత్ ఎక్కడ ఉంటాడనే విషయం తెలియలేదని, అందుకే అతని సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించానని అన్నారు. అతని ఆచూకీ తెలిస్తే, అతనికి కౌన్సెలింగ్ ఇప్పించగలుగుతానన్నారు. ఇలాంటి ఉత్తరాలు ఎమ్మెల్యేలకు రాయడం సరికాదన్నారు.

Updated Date - 2021-09-14T12:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising