బంధువుల పెళ్లికి తీసుకెళ్లలేదని భర్త మీద అలిగిన భార్య.. ఆ కోపంలో ఎంత పని చేసిందంటే..
ABN, First Publish Date - 2021-12-02T19:07:22+05:30
బంధువుల పెళ్లికి తీసుకెళ్లలేదని భార్త మీద అలిగింది.. అతనితో గొడవపడింది..
బంధువుల పెళ్లికి తీసుకెళ్లలేదని భార్త మీద అలిగింది.. అతనితో గొడవపడింది.. ఆ కోపంలో దారుణ నిర్ణయం తీసుకుంది.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురికి చెందిన రేష్మ అనే మహిళ బుధవారం తన బంధువుల పెళ్లికి వెళదామనుకుంది. అయితే ఆమెను తీసుకెళ్లకుండా ఆమె భర్త రోహిత్ వాల్మీకి ఒక్కడే పెళ్లికి బయల్దేరాడు.
తనను కూడా వివాహానికి తీసుకెళ్లమని భర్తతో రేష్మ గొడవపడింది. అయితే రోహిత్ అందుకు అంగీకరించలేదు. భర్త తనను పెళ్లికి తీసుకెళ్లలేదనే కోపంతో రేష్మ ఆవు పేడ తినేసింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రేష్మను చుట్టుపక్కల వారు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మరికొద్ది గంటలు గడిస్తేనే ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని చెప్పారు.
Updated Date - 2021-12-02T19:07:22+05:30 IST