ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాబాలో ప్రేయసితో బిర్యానీ తింటూ భార్యకు దొరికిపోయాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-07-07T16:46:26+05:30

దాబాలో ప్రేయతో బిర్యానీ తింటూ భార్యకు దొరికిపోయి అడ్డంగా బుక్కయిపోయాడు ఓ వ్యక్తి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధాబాలో ప్రేయసితో బిర్యానీ తింటూ భార్యకు దొరికిపోయి అడ్డంగా బుక్కైపోయాడు ఓ వ్యక్తి. దీంతో అందరూ చూస్తుండగానే ఆ మహిళ తన భర్త గాళ్‌ఫ్రెండ్‌ను చితకబాదింది. చివరకు అందరూ కలిసి మేటర్‌ను సెటిల్ చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో బీనా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, అతడిని చూసి వస్తానని తన భార్యకు చెప్పి రాహుల్ అనే వ్యక్తి గత సోమవారం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే రాహుల్ ప్రవర్తనపై ఎప్పట్నుంచో అనుమానంతో ఉన్న అతని భార్య అతడిని వెంబడించాలని నిర్ణయించుకుంది. తను మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్లింది. ఆమె అనుమానించినట్టే రాహుల్ తన ప్రేయసితో కలిసి బీనా ప్రాంతంలోని ఓ ధాబా వద్ద బిర్యానీ తింటూ కనిపించాడు. 


ఆగ్రహానికి గురైన వారందరూ రాహుల్‌తో వచ్చిన మహిళను చితకబాదారు. దాదాపు అరగంట పాటు ఆ ధాబా వద్ద గొడవ జరిగింది. చివరకు పోలీసుల వరకు వెళ్లకుండా వారు అక్కడే మేటర్ సెటిల్‌ చేసుకున్నారు. ఇక, మళ్లీ ఎప్పుడు కలుసుకోమని రాహుల్, ఆ మహిళ చెప్పడంతో అందరూ శాంతించారు. 

Updated Date - 2021-07-07T16:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising