ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు పిల్లల తల్లి అయిన మేనత్తతో 18 ఏళ్ల కుర్రాడి ప్రేమాయణం.. చివరకు వీళ్ల కథ ఎన్ని మలుపులు తిరిగిందంటే..

ABN, First Publish Date - 2021-09-09T01:05:22+05:30

మేనత్తతో యువకుడి ప్రేమ..చివరికి దారుణం జరిగిపోయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు 21. అప్పటికే ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతడి వయసేమో 18. ఇద్దరూ దాదాపు ఒకేవయసు వారు. కానీ.. ఆమె వరుసకు అతడికి మేనత్త అవుతుంది. ఈ విషయం వారికి కూడా తెలుసు. అయినా కూడా వారు ప్రేమ బంధంలో చిక్కుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. సహజంగానే వారి కుటుంబ సభ్యులు ఈ ప్రేమను ఆమోదించలేదు. దీంతో.. ఆ ఇద్దరూ ఇంట్లోని పారిపోయారు. మరో చోట కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్నారు. ఇంతలోనే వారి జీవితం అకస్మాత్తుగా ముగిసిపోయింది. సెప్టెంబర్ 5న జరిగిన ఈ దారుణం ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.  


రాష్ట్రంలోని కోడెర్మా జిల్లాకు చెందిన సోనూ(18) బబితలు(21) తమ ప్రేమను ప్రపంచం అంగీకరించదని తెలిసీ ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ విషయం వారి వారి కుటుంబ సభ్యులకు తెలియడంతో నానా గలాటా జరిగింది. గ్రామపెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరించలేదు. ఇలా అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరగడంతో సెప్టెంబర్ 5న వారు ఇల్లు వదిలి పారిపోయారు. దీంతో.. బబిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం వారు విషం పుచ్చుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నట్టు రెండు కుటుంబాలకు సమాచారం అందింది. వారు ఘటనాస్థలికి చేరుకునే సరికే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 


అయితే.. యువకుడి కుటుంబసభ్యులు మత్రం ఇవి ఆత్మహత్యలు కావంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. నిందితులకు శిక్ష పడేవరకూ  వరకూ అంత్యక్రియలు జరగనివ్వమని భీష్మించుకు కూర్చున్నారు. బబిత భర్తే ఈ తన కుమారుడిని అంతమొందించాడని సోనూ తండ్రి ఆరోపించారు. దీంతో..కోడర్మా-గిరిఢీ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. దీంతో.. పోలీసులు రంగంలోకి సోనూ కుటుంబసభ్యులకు నచ్చచెప్పి పంపించారు. సోనూ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలకు పోస్టు‌మార్టం నిర్వహించిన అనంతరం.. అంత్యక్రియలు జరిగాయి. ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

Updated Date - 2021-09-09T01:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising