ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ భర్తకు వింత కష్టం.. ప్లకార్డుపై భార్య ఫొటోతో.. 4 రోడ్ల కూడలిలో నిలబడి దీనంగా.. అసలు కథేంటంటే..

ABN, First Publish Date - 2021-09-12T02:44:14+05:30

ఓ భర్తకు వింత కష్టం.. పోస్టర్‌పై భార్య ఫొటో ముద్రించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చేతిలో పెద్ద ప్లకార్డ్ పట్టుకుని ఓ ప్రధాన కూడలిలో నిలబడ్డాడా వ్యక్తి. ఆ ప్లకార్డ్‌పై భార్య, అత్త, మామా, బావమరిది చిత్రాలు ఉన్నాయి. వీటికిపైన బ్లాక్ మెయిలర్లు అని రాసి ఉంది. దాని కంటే కింద.. కిడ్నీ అమ్మకానికి ఉంది అని రాసుంది. ఈ పోస్టర్ పట్టుకుని అతడు.. తన కిడ్నీ అమ్మడానికి సిద్ధమైపోయాడు. ఇటువంటి అసాధారణ పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి పేరు సంజీవ్ కుమార్. ఆయనది బిహార్ రాష్ట్ర రాజధాని పట్నా. 


తాను అత్తారింటి వేధింపులు తట్టుకోలేకే కిడ్నీని అమ్మకానికి పెట్టానన్నాడు. ‘నన్ను, నా భార్యను ఐదేళ్లుగా వారు కలవనివ్వడం లేదు’ అంటూ దారిన పోయే వారితో తన గోడు చెప్పుకున్నాడు. భార్యను కలవడానికి ఆమె పుట్టింటికి వెళ్లిన ప్రతిసారీ తన్నులు తిని తిరిగిరావాల్సి వస్తోందని వాపోయాడు. తొలిసారి గర్భం దాల్చిన భార్య పుట్టింటికి వెళ్లిన నాటి నుంచీ తనకీ కష్టాలు మొదలయ్యాయన్నాడు. 

ఇవీ చదవండి
గర్భాన్ని తీసేయొద్దు.. నేను పెళ్లి చేసుకుంటానన్న యువకుడు.. నో చెప్పిన యువతి.. చివరకు వీళ్ల కథ ఎంత దూరం వెళ్లిందంటే..
అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. బైక్‌పై ఇంటి దగ్గరకు చేరుకోగానే ఊహించని ట్విస్ట్.. అతడికి మైండ్ బ్లాక్..!


తన భార్యకు ఆమె పుట్టింటి వారు బలవంతంగా కడుపు తీయించారని.. నెపం మాత్రం తనపై నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వల్లే గర్భస్రావమైందంటూ తనపై తప్పుడు కేసు కూడా పెట్టారని చెప్పిన సంజీవ్.. ప్రస్తుతం తాను ముందస్తు బెయిల్‌ పొంది జైలుపాలు కాకుండా తప్పించుకోగలిగానని పేర్కొన్నారు. తన భార్యను తిరిగి చూడాలంటే అత్తారు అడిగినంత డబ్బు ఇచ్చుకోవడమొక్కటే మార్గమని వాపోయాడు. తన వద్ద అంత డబ్బు లేని కారణంగా.. కిడ్నీ అమ్మి సొమ్ము కూడబెట్టేందుకు సిద్ధపడ్డానని సంజీవ్ చెప్పాడు. ఇది కూడా కుదరకపోతే.. చివరికి ఆత్మహత్యే తనకు శరణ్యమంటూ నిస్సహాయత వ్యక్తం చేశాడు. 

Updated Date - 2021-09-12T02:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising