Viral Video: అతడి మీదకు అమాంతం దూకేసిన సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
ABN, First Publish Date - 2021-12-19T23:58:55+05:30
సింహం ఒక్కసారిగా మనిషి మీదకు దూకితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పరిస్థితిలో దానికి బలి కావడం తప్ప.. బతికే ఛాన్సే ఉండదు. అలాంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
క్రూరజంతువులకు మిగతా జంతువులపై దాడి చేయడం తప్ప వేరే ఆలోచన ఉండదు. వాటి స్వభావమే అది కాబట్టి.. సింహాలు, పులులు తదితర క్రూరజంతువులకు ఆమడ దూరంలో ఉంటాం. పొరపాటున వాటిని చూస్తే.. వెన్నులో వణుకు పుడుతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప.. వాటి బారి నుంచి ప్రాణాలతో బయటపడలేం. అలాంటిది చురుకైన సింహం ఒక్కసారిగా మనిషి మీదకు దూకితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పరిస్థితిలో దానికి బలి కావడం తప్ప.. బతికే ఛాన్సే ఉండదు. అలాంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా కలహరి ఎడారి రిజర్వ్‌లో ఓ సింహం వాల్ గ్రునెర్ అనే వ్యక్తి మీదకు దూకుతుంది. కానీ అతడికి చిన్నగాయం కూడా కాదు. ఆశ్యర్యపోతున్నారా.. అసలు విషయంలోకి వెళితే.. వాల్ గ్రునెర్ అనే వ్యక్తి జూలో సింహాల సంరక్షకుడిగా ఉన్నాడు. సింహాలను చిన్నప్పటి నుంచి అతను ఎంతో ప్రేమగా చూసుకోవడంతో.. అతడికి అవి బాగా దగ్గరయ్యాయి. తొమ్మిదేళ్ల ఓ సింహం.. గ్రునెర్‌కు చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఎన్‌క్లోజర్ గేట్‌ను తెరవగానే ఒక్కసారిగా బయటికి వచ్చి.. సంరక్షుడి మీదకు దూకుతుంది. చూసే వాళ్లకు అతన్ని చంపేస్తుందేమో అని అనిపిస్తుంది. కానీ ఆ సింహం ఎంతో ప్రేమతో అలా చేసిందని తర్వాత తెలుసుకుంటాం.
అమ్మాయ్.. లే.. లే.. పెళ్లికొడుకు తాళి కడతాడట..! వధువుపై ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు
నిత్యం సింహాలతో గడిపే వాల్ గ్రునెర్.. వాటికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేస్తూ ఉంటాడు. సింహంతో స్నేహం చేసే మనుషులు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి.. ఇతని వీడియోలను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతుంటారు. సింహంతో రోజంతా అతను స్నేహితుడిగా గడిపే వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా వాల్ గ్రునెర్‌ను రియల్ హీరో అని మెచ్చుకుంటున్నారు. అసలే క్రూరమృగాలు కాబట్టి.. కాస్త జాగ్రత్త బ్రదర్.. అంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు.
ఏనుగులు కూడా కామెడీ చేస్తాయా.. ఈ మహిళను ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో మీరే చూడండి..
Updated Date - 2021-12-19T23:58:55+05:30 IST