Viral Video: అమ్మాయ్.. లే.. లే.. పెళ్లికొడుకు తాళి కడతాడట..! వధువుపై ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు
ABN, First Publish Date - 2021-12-19T22:28:27+05:30
ఓ పెళ్లికూతురు ఎరుపు, నారింజ రంగు చీరలో ముస్తాబై, పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటుంది. పక్కనే వరుడు నిలబడి తాళి కట్టేందుకు సిద్ధంగా ఉంటాడు. అప్పటికే చాలా అలసిపోయిన వధువు...
పెళ్లికూతురు లేవడమేంటీ, పెళ్లికొడుకు తాళి కట్టడమేంటీ.. అని ఆశ్చర్యపోతున్నారు కదా. కొన్నిసార్లు ఇలా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మామూలుగా అయితే ఇలాంటివి అందరికీ తెలియవు. ప్రస్తుతం ప్రపంచంలో ఏమూల, ఏ చిన్న ఘటన జరిగినా.. ఇట్టే మన అరచేతిలోకి వచ్చి పడుతోంది. ఈ క్రమంలో కాస్త విభిన్నంగా ఉన్న వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. తీరా తాళి కట్టే సమయంలో ఈ పెళ్లికూతురు చేసిన పనికి.. కళ్యాణ మండపంలో అంతా సరదాగా నవ్వుకున్నారు.
వివాహ కార్యక్రమాలు చూడటానికి ఎంత సంబరంగా, సరదాగా ఉంటాయో.. అంతే స్థాయిలో హడావుడితో పాటూ తీరిక లేని పనులు ఎన్నో ఉంటాయి. ఇక మహిళల పరిస్థితి చెప్పనక్కలేదు. పెళ్లికి సంబంధించిన పనులన్నీ ఎక్కువ భాగం వారే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలా అలసిపోతూ ఉంటారు. అయినా అదంతా పక్కన పెట్టి, వివాహ ఘట్టం పూర్తయ్యే వరకూ అలుపు లేకుండా కష్టపడుతుంటారు. మరోవైపు బంధువుల పలకరింపులు, అలంకరణ తదితర కారణాలతో పెళ్లికూతుళ్లు కూడా చాలా అలసిపోతుంటారు. చిన్న కునుకు తీద్దామన్నా ఆ సమయంలో వారికి వీలు ఉండదు. ఓ పెళ్లికూతురుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
పెళ్లి జరగాల్సిన టైమ్‌లో వరుడి మాటలకు అంతా షాక్.. ఎంత చెప్పినా వినలేదని వధువు బంధువులంతా కలిసి..
ఈ వీడియోలో ఓ పెళ్లికూతురు ఎరుపు, నారింజ రంగు చీరలో ముస్తాబై, పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటుంది. పక్కనే వరుడు నిలబడి తాళి కట్టేందుకు సిద్ధంగా ఉంటాడు. అప్పటికే చాలా అలసిపోయిన వధువు.. ఈ గోలతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా.. కాసేపు కునుకు తీస్తుంది. అక్కడున్న వారంతా పెళ్లికూతురును చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈలోగా ఆమె స్నేహితులు ఈ తంతును మొత్తం వీడియో తీసి, ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘పాపం, పెళ్లికుమార్తె చాలా అలసిపోయి.. కాసేపు కునుకు తీస్తోంది.. అందులో తప్పేముంది’’.. అంటూ ఒకరు, ‘‘ వధువు ఒంటి మీద అంత బరువు పెట్టారు.. అలసిపోకుండా ఎలా ఉంటుంది’’.. అని మరొకరు, ఇలా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
తల్లి రెండో పెళ్లి గురించి ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పెట్టిన కూతురు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్
Updated Date - 2021-12-19T22:28:27+05:30 IST