ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీసం ఒక్క హిందువు కూడా లేని ఆ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం.. నేటికీ అంతుచిక్కని రహస్యం!

ABN, First Publish Date - 2021-10-24T13:31:23+05:30

ప్రపంచంలోని పలు దేశాలలో ప్రసిద్ధ హిందూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని పలు దేశాలలో ప్రసిద్ధ హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే అతిపెద్ద హిందూ దేవాలయం ఉన్న ఆ దేశంలో కనీసం ఒక్క హిందువు కూడా లేడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పైగా ఆ దేశ జెండాకు చిహ్నంగా హిందువుల ఆలయం ఉండటం విశేషం. ప్రపంచంలో  హిందూమతం అతి పురాతనమైనదిగా పేరొందింది. హిందూ మతం లేదా ధర్మం 12 వేల సంవత్సరాల పురాతనమైనదని భావిస్తున్నారు. హిందూ మతంలో విగ్రహారాధన, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు అనుసరించే సనాతన ధర్మం మొదటిది అనడానికి అనేక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. 


అంకోర్వట్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ప్రసిద్ది చెందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారక చిహ్నంగా కూడా గుర్తింపు పొందింది. ఈ ఆలయం కంబోడియాలోని అంకోర్‌లో ఉంది. అక్కడి సిమ్రిప్ నగరంలోని మెకాంగ్ నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ దేవాలయం కొన్ని వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఇది విష్ణు ఆలయం. ఇక్కడ అప్పటి పాలకులు శివుని దేవాలయాలను కూడా నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పూర్వకాలంలో యశోధ్‌పూర్ అని పిలిచేవారు. ఈ విష్ణు ఆలయాన్ని క్రీస్తుశకం 1112 నుంచి క్రీస్తుశకం 1153 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన 2వ సూర్యవర్మ రాజు నిర్మించారు. ఈ ఆలయ చిత్రం కంబోడియా జాతీయ పతాకంలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. అలాగే యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూగా గుర్తింపు పొందింది.


కంబోడియాలో అతిపెద్ద హిందూ దేవాలయం ఉన్నప్పటికీ ఇక్కడ హిందూ ధర్మాన్ని విశ్వసించేవారు ఇప్పుడు ఎందుకు లేరనే ప్రశ్న తలెత్తుతుంది. చారిత్రక ఆదారాల ప్రకారం ఇక్కడి ప్రజలు ఇతర మతాలను స్వీకరించారు. కంబోడియా ఆగ్నేయాసియాలో ఒక ప్రధాన దేశంగా ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 17 మిలియన్ల జనాభా ఉంది. తూర్పు ఆసియాలో గతంలో అనేక పురాతన ఆలయాలను గుర్తించారు. ఈ పరిశోధనలు భారతదేశ పురాతన సంస్కృతిని ప్రతిబింబించాయి. కంబోడియా సంస్కృత నామం కంబూజ్ లేదా కాంబోజ్. కాంబోజ్‌కు సంబంధించిన పురాతన కథల ప్రకారం శివుని ప్రేరణతో కంబు స్వయంభువ్ రాజు.. కాంబోజ్ దేశానికి వచ్చాడు. అక్కడి నాగ కులరాజు సహాయంతో ఈ రాజ్యాన్ని స్థాపించాడు. అనంతరం అతను నాగ కులరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా కంబుజ్ వంశానికి పునాది వేశాడు. ఇక్కడి ప్రజలు నేటికీ హిందువులను అమితంగా ఆదరిస్తుంటారు.

Updated Date - 2021-10-24T13:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising