ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌లో భారత మహిళల విజయాలపై గర్వపడుతున్న వేళ.. ‘శాయ్’ వివాదాస్పద నిర్ణయం

ABN, First Publish Date - 2021-08-09T01:59:02+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళలు సాధించిన విజయాలకు దేశం మొత్తం గర్విస్తున్న వేళ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళలు సాధించిన విజయాలకు దేశం మొత్తం గర్విస్తున్న వేళ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన బధిర బాలిక విషయంలో తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


18 ఏళ్ల సమీహ బార్విన్ లాంగ్ జంప్, 100 మీటర్ల ట్రాక్ అథ్లెట్. ఈ నెల 23-28 మధ్య పోలండ్‌లో 4వ ప్రపంచ డెఫ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ జరగనున్నాయి. వీటికోసం జరిగిన నేషనల్ ట్రయల్స్‌లో సమీహ ఎంపికైంది. అయితే, ఈ పోటీలకు ఎంపికైన ఆరుగురిలో ఐదుగురు పురుష అథ్లెట్లే ఉన్నారు. దీంతో పురుషులతో కలిసి ఈ సమీహాను పోలండ్ పంపేందుకు శాయ్ నిరాకరించింది.


90 శాతం వినికిడి లోపం ఉన్న సమీహ 12 ఏళ్ల నుంచే లాంగ్‌జంప్, 100 ట్రాక్ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 2017లో ఝార్ఖండ్, 2018లో చెన్నై, 2019లో కాలికట్‌లో జరిగిన జాతీయ డెఫ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణాలు సాధించింది. 100 మీటర్ ట్రాక్‌లో సమీహ 1986 నాటి రికార్డును బద్దలు కొట్టిందని ఆమె తల్లి సలామత్ తెలిపారు.


తన కుమార్తె క్రీడలను ఎంచుకోవడాన్ని తొలుత తాను ఇష్టం లేదని, అయితే క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తుండడంతో తర్వాత అంగీకరించినట్టు చెప్పారు. సమీహ అద్భుతమైన క్రీడాకారిణి అని పేర్కొన్నారు. ఇలాంటి డొంకతిరుగుడు కారణాలతో సమీహాను పోలండ్ పంపకపోవడం దారుణమని అన్నారు.


ఏది ఏమైనా కుమార్తె గౌరవాన్ని నిలబెట్టేందుకు పోరాడతానని అన్నారు. పోలండ్ వెళ్లేవారిలో తన కుమార్తె మాత్రమే మహిళా అథ్లెట్ కావడంతో పంపలేమని శాయ్ అధికారులు చెప్పారని, అంతేకాక, నిధుల లేమి కారణంగా ఆమెకు ఎస్కార్ట్ కూడా కల్పించలేమని చెప్పారని సలామత్ పేర్కొన్నారు. 


మరోవైపు, సమీహా విషయం తెలిసిన కన్యాకుమారి నియోజకవర్గ ఎంపీ వి.విజయ్‌కుమార్ జులై 26న కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాస్తూ సమీహాను పోలండ్ వెళ్లే జట్టులో చేర్చాలని కోరారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని సలామత్ ఆవేదన వ్యక్తం చేశారు. సమీహా కుటుంబం కన్యాకుమారిలోని కడైయాలుమూడులో చిన్న కాఫీ షాపు నిర్వహిస్తోంది. ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కాగా, ఈ నెల 14న భారత బృందం పోలండ్ బయలుదేరనుంది. 

Updated Date - 2021-08-09T01:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising