బీసీసీఐ.. 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళం!
ABN, First Publish Date - 2021-05-24T22:26:55+05:30
ప్రాణవాయువు కొరతతో అల్లాడుతున్న కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకు వచ్చింది.
ప్రాణవాయువు కొరతతో అల్లాడుతున్న కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకు వచ్చింది. మహమ్మారి కరోనాపై పోరులో దేశానికి అండగా నిలిచేందుకు తన వంతు సహాయం చేస్తోంది. 10 లీటర్ల సామర్థ్యం గల 2 వేల ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు (సోమవారం) ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే నెలల్లో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లను పంపిణీ చేస్తామని బీసీసీఐ ప్రకటించింది.
`వైరస్‌పై పోరాటంలో వైద్య సిబ్బంది పాత్ర మరువలేనిది. మనల్ని కాపాడడం కోసం వారు ఏం చేయగలరో అంతా చేస్తున్నారు. వారే నిజమైన ఫ్రంట్‌లైన్ వారియర్లు. బోర్డు ఎప్పుడూ ఆరోగ్యం, రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లు చాలా మందికి ప్రస్తుతం తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. చాలా మందిని కాపాడతాయ`ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.
Updated Date - 2021-05-24T22:26:55+05:30 IST