వండర్ మెకియాన్ కింగ్ డ్రస్సెల్
ABN, First Publish Date - 2021-08-02T10:08:40+05:30
ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా మెకియాన్, అమెరికా స్విమ్మర్ కాలెబ్ డ్రస్సెల్ ఈతకొలనులో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన ఏకైక మహిళా స్విమ్మర్‌గా మెకియాన్ చరిత్ర...
టోక్యో: ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా మెకియాన్, అమెరికా స్విమ్మర్ కాలెబ్ డ్రస్సెల్ ఈతకొలనులో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన ఏకైక మహిళా స్విమ్మర్‌గా మెకియాన్ చరిత్ర సృష్టించింది. చివరి రోజు జరిగిన మహిళల 50 మీ. ఫ్రీస్టయిల్ రేస్‌ను 23.81 సె. ఒలింపిక్ రికార్డుతో పూర్తి చేసి స్వర్ణంతో ఆరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక చివరగా 4x100 మీ. మెడ్లే ఈవెంట్ పసిడి పతకాన్నీ ఆస్ట్రేలియా నెగ్గడంతో ఆ జట్టు సభ్యురాలైన మెకియాన్ ఏడో పతకంతో రికార్డు పుటల్లోకెక్కింది. మొత్తంగా 4 స్వర్ణాలు, 3 కాంస్య పతకాలతో మెకియాన్ ఈ గేమ్స్‌ను ఘనంగా ముగించింది. అలాగే ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన మహిళా అథ్లెట్‌గా రష్యా జిమ్నాస్ట్ గొరొఖోవస్క్యా సరసన మెకియాన్ నిలిచింది. రియో, టోక్యో పతకాలతో కలిపి విశ్వక్రీడల్లో మెకియాన్ సాధించిన మొత్తం మెడల్స్ సంఖ్య 11కు చేరింది.
Updated Date - 2021-08-02T10:08:40+05:30 IST