ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నై టెస్ట్ - టీ బ్రేక్: ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ 119/5

ABN, First Publish Date - 2021-02-08T19:58:58+05:30

చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టును భారత జట్టు కట్టడి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టును భారత జట్టు కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లీష్ జట్టు 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 360 పరుగుల ఆధిక్యతలో ఉంది. 


అంతకుముందు ... నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. తొలి ఇన్నింగ్సులో 337 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఓవర్‌ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బర్న్స్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. రహానే చేతికి చిక్కిన బర్న్స్ పెవిలియన్ చేరాడు. దీంతో 114 ఏళ్ల రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. తొలి ఓవర్‌లో తొలి బంతికే అవుట్ చేయడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఆ తర్వాత సిబ్లే రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్‌లో పుజారా చేతికి చిక్కాడు. ఇక మూడో వికెట్‌గా డేనియల్, నాలుగో వికెట్‌గా బెన్ స్టోక్స్ అవుట్ అయ్యారు. తొలి ఇన్నింగ్సులో చెలరేగిన ఆ జట్టు కెప్టెన్ జో రూట్‌ను బుమ్రా అవుట్ చేశాడు. 32 బంతుల్లో 40 పరుగులు చేసి ఊపు మీద కనిపించిన రూట్.. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.      

Updated Date - 2021-02-08T19:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising