ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ThumbsUp Ad: ఆ స్టార్ నో.. మన స్టార్లు యస్.. ఎవరు హీరోలు?..

ABN, First Publish Date - 2021-07-16T01:58:58+05:30

ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో తెలుసు కదా. మొన్నామధ్య ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూర్చున్న రొనాల్డో.. తన ముందున్న కోకాకోలా బాటిల్స్ పక్కకు నెట్టేసి, వాటర్ బాటిల్ తీసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో తెలుసు కదా. మొన్నామధ్య ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూర్చున్న రొనాల్డో.. తన ముందున్న కోకాకోలా బాటిల్స్ పక్కకు నెట్టేసి, వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ‘నో కోక్.. వాటర్’ అని ఒక్క ముక్క చెప్పాడంతే. ఈ ఒక్క వాక్యం కోకా కోలా కంపెనీకి ఎక్కడలేని చిక్కులు తెచ్చిపెట్టింది. 4 బిలియన్ డాలర్లపైగా నష్టాలు తెచ్చింది. ఈ ఘటనతో వచ్చిన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు కోకాకోలా కంపెనీ.. ఒలింపిక్స్‌ను టార్గెట్ చేసుకుంది. ఒలింపిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న కోకాకోలా బ్రాండ్ థంబ్స్‌అప్.. భారత అథ్లెట్లతో బ్రాండ్ అడ్వర్టైజ్ చేసుకుంది. దీనిపై ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద దుమారమే రేగుతోంది.



భారత్‌లో తయారైన థంబ్స్ అప్ బ్రాండ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. అయితే చాలా కాలంగా థంబ్స్ అప్, పెప్సీ, కోకా కోలా వంటి కార్బొనేటెడ్ డ్రింక్స్‌ విషయంలో ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తూనే వచ్చారు. అయితే రొనాల్డో వంటి సూపర్ స్టార్.. కోకా కోలాను దూరంగా పెట్టడంతో ఆయన అభిమానులు కూడా ఈ బ్రాండ్‌కు దూరం జరిగినట్లున్నారు. ఆ తర్వాత పాల్ పోగ్బా వంటి మరికొందరు ఫుట్‌బాల్ స్టార్లు కూడా తమ ముందున్న డ్రింకులను పక్కకు నెట్టేశారు. దీంతో ఈ కంపెనీ ఈ ఘటనను ప్రజల మదిలో నుంచి చెరిపేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్ వంటి విశ్వక్రీడల వేడుకను దీనికి వేదిక చేసుకుంది. భారత రెజ్లర్ భజరంగ్ పూనియా, బాక్సర్ వికాస్ కృషన్ యాదవ్, ఆర్చర్ దీపికా కుమారి, అతను దాస్ సహా భారత షూటింగ్ బృందం మొత్తాన్ని చూపిస్తూ థంబ్స్ అప్ యాడ్ చేసింది. ‘‘తూఫాన్ వహీ జో సబ్ #PalatDe’’ (నిజమైన తుఫాన్ అంటే అన్నింటినీ తలకిందులు చేసేది) అంటూ ప్రమోట్ చేసుకుంటోంది. అయితే ఈ యాడ్, దానిలో భారత అథ్లెట్లు పాలుపంచుకోవడం మాత్రం కొంతమంది నెటిజన్లకు నచ్చలేదు.


‘‘ఈ యాడ్లో పాల్గొన్న భారత క్రీడాకారులు నిజంగా థంబ్స్ అప్ తాగుతారా? అసలు ప్రొఫెషనల్ అథ్లెట్లు కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగుతారా?’’ అంటూ వాళ్లందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏంటో ఈ డ్రింక్ తాగిన తర్వాతే ఈ అథ్లెట్లు అందరూ ఒలింపిక్స్ చేరినట్లు ఈ యాడ్ ఉందని, కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వాదిస్తున్న నెటిజన్లు.. షుగర్ వంటి ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలే ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో ఎక్కువగా ఉంటాయన్న నిజాన్ని నొక్కిచెప్తున్నారు. భారత అథ్లెట్లు కూడా రోనాల్డో అడుగుజాడల్లో నడిచి తాము తాగని బ్రాండ్లకు ప్రమోట్ చేయడం మానుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? కార్బొనేటెడ్ డ్రింకులకు ‘నో’ చెప్పిన రొనాల్డో హీరోనా? లేక ‘యస్’ అని చెప్పిన మన అథ్లెట్లు హీరోలా?


మీ స్పందనను ఏబీఎన్ పోల్‌లో చెప్పండి

Updated Date - 2021-07-16T01:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising