BWF World Championships: ఫైనల్‌లో ఓడిన శ్రీకాంత్.. కాంస్యంతో సరి!
ABN, First Publish Date - 2021-12-20T02:21:24+05:30
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు. స్వర్ణం కోసం కొద్దిసేప..
వెల్వా (స్పెయిన్): బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు. స్వర్ణం కోసం కొద్దిసేపటి క్రితం జరిగిన మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు లో కీన్‌యూ చేతిలో 21-15, 22-20 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.
ఈ పతకంతో శ్రీకాంత్ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఈ గేమ్‌లో శ్రీకాంత్ తీవ్రంగా పోరాడినప్పటికీ ప్రత్యర్థి కీన్ యూ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ చివరి వరకు పోరాడిన కిడాంబి.. ప్రత్యర్థి స్మాష్‌ల ముందు నిలవలేకపోయాడు.
కాగా, ఈ వేదికపై భారత్‌కు ఇది రెండో పతకం. సెమీస్‌లో కిడాంబి చేతిలో ఓడిన లక్ష్యసేన్ ఇప్పటికే కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ రజతం సాధించాడు.
Updated Date - 2021-12-20T02:21:24+05:30 IST