ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడాల్‌ శుభారంభం

ABN, First Publish Date - 2021-06-02T08:42:53+05:30

క్లే కోర్ట్‌ కింగ్‌ రఫెల్‌ నడాల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. 14వ టైటిల్‌పై గురిపెట్టిన రఫా.. వరుస సెట్లలో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకొన్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సెరెనా, బార్టీ ముందుకు ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: క్లే కోర్ట్‌ కింగ్‌ రఫెల్‌ నడాల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. 14వ టైటిల్‌పై గురిపెట్టిన రఫా.. వరుస సెట్లలో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకొన్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నడాల్‌ 6-3, 6-2, 7-6(3)తో అలెక్సీ పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)పై కష్టపడి నెగ్గాడు. 14వ సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 1-6, 7-6(6), 6-4, 6-4తో అల్బర్ట్‌ రామోస్‌ వినోలాస్‌ (స్పెయిన్‌)పై, 21వ సీడ్‌ అలెక్స్‌ డి మినార్‌ (అమెరికా) 6-2, 6-4, 7-6(4)తో ట్రావెగ్లియాపై గెలిచాడు. రష్యా ఆటగాడు అస్లన్‌ కరాట్‌సెవ్‌ 6-3, 6-4, 6-4తో జాన్సన్‌ బ్రూక్‌బైను, 10వ సీడ్‌ డిగో ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా) 6-2, 6-2, 6-3తో లు యన్‌ సన్‌ను ఓడించారు. కాగా, 7వ సీడ్‌ ఆండ్రే రుబలేవ్‌ 3-6, 6-7(6), 6-4, 6-3, 4-6తో జాన్‌ జెన్నార్డ్‌ (జర్మనీ) చేతిలో ఓడాడు. 

సెరెనా ముందుకు: మహిళల్లో 24వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఉన్న ఏడో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ 7-6(6), 6-2తో ఇరినా కమేలియా బెగు (రొమేనియా)పై వరుస సెట్లలో నెగ్గింది. 2019 చాంపియన్‌ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-4, 3-6, 6-2తో బెర్నార్డ్‌ పెరా (అమెరికా)ను ఓడించింది. ఐదో సీడ్‌ స్విటోలినా 6-2, 7-5తో ఓషన్‌ బేబల్‌ (ఫ్రాన్స్‌)పై, 13వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా) 6-3, 6-3తో అనస్టాసిజా సెవస్టోవా (లాత్వియా)పై, గ్రీస్‌ భామ మరియా సక్కారి 6-4, 6-1తో జవాస్టకాపైనెగ్గారు.

రెండో రౌండ్‌కు బోపన్న జోడీ: పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న జోడీ రెండో రౌండ్‌కు చేరుకొంది. తొలి రౌండ్‌లో బోపన్న-ఫ్రాంకో కుగోర్‌ (క్రొయేషియా) జంట 6-4, 6-2తో నొకలొజ్‌ బసిలా్‌షవిలి-ఆండ్రే బెంజిమన్‌పై గెలిచింది. 


Updated Date - 2021-06-02T08:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising