ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోటా భీమ్ నుంచి.. పసిడి వీరుడిగా!

ABN, First Publish Date - 2021-08-08T02:23:12+05:30

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నీరజ్ చోప్రా 2016 రియో ఒలిపింక్స్‌లో విమానం ఎక్కి ఉండేవాడు. కానీ అదృష్టం అతడిని వెనక్కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నీరజ్ చోప్రా 2016 రియో ఒలిపింక్స్‌లో విమానం ఎక్కి ఉండేవాడు. కానీ దురదృష్టం అతడిని వెనక్కి పట్టిలాంగింది. 2016లో పోలండ్‌లోని బైడ్గోష్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కానీ అప్పటికే ఒలింపిక్ క్వాలిపికేషన్ సమయం గడిచి 12 రోజులు అయిపోవడంతో రియో వెళ్లే అవకాశాన్ని కోల్పోయాడు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత పానిపట్‌లోని ఖంద్రా గ్రామానికి చెందిన చోప్రా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌ ట్రాక్‌లో స్వర్ణం సాధించిన తొలి ఇండియన్‌గా, ఫీల్డ్‌లో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా  రికార్డులకెక్కాడు. 


ఈ రోజు జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా దేశానికి బంగారు పతకం అందించాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వద్లెజెచ్, విటెజ్‌స్లావ్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలు సాధించారు. 


టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల నీరజ్ బాలుడిగా ఉన్నప్పుడు బాలభీముడిని తలపించేవాడు. ప్రతి రోజూ నెయ్యి, వెన్న, మీగడ లాగించేసేవాడు. ఫలితంగా 13 ఏళ్ల వయసులో 80 కేజీల బరువుతో స్థూలకాయుడిగా మారాడు. నీరజ్ భారీ కాయాన్ని చూసి బాధపడిన అతడి అంకుల్ భీమ్ చోప్రా 2011లో పానిపట్ స్పోర్ట్స్ స్టేడియానికి తీసుకెళ్లి తమ వాడిని తిరిగి మామూలు ఆకారంలోకి తీసుకు రావాలంటూ ట్రైనర్లను బతిమాలేవారు. 


జిమ్ సెషన్ పూర్తయ్యాక నీరజ్ పానిపట్‌లోని ‘సాయ్’ సెంటర్‌కు వెళ్లేవాడు. నీరజ్ జావెలిన్ త్రోను ఎప్పుడు ప్రారంభించాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఒకసారి అతడి ఫొటో స్థానిక న్యూస్‌పేపర్‌లో వచ్చిందని, అంతర్ జిల్లా పోటీల్లో గెలిచాడని రాశారని పేర్కొన్నారు. అప్పుడే నీరజ్ జావెలిన్ త్రో ఆడుతున్నట్టు తమకు తెలిసిందని భీం చోప్రా పేర్కొన్నారు. నిజానికి జావెలిన్ త్రో గురించి తమ కుటుంబంలో ఎవరికీ తెలియదని చెప్పారు. ‘జావెలిన్ విసరడం కూడా ఓ ఆటా?’ అని అనుకునేవారమని వివరించారు.


జైవీర్ అనే సీనియర్ నీరజ్ ప్రతిభను గుర్తించి పానిపట్‌లోని సాయ్ సెంటర్‌లో అతడికి ప్రాథమిక శిక్షణ ఇచ్చాడు. జైవీర్ ప్రస్తుతం ఎన్ఐఎస్ పటియాలా కోచ్‌గా ఉన్నారు. తాజాగా, నీరజ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంతో నాటి సంగతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘నీరజ్ ప్రతి రోజూ ట్రాక్‌కు వచ్చేవాడు. ఒకరోజు జావెలిన్ విసురుతావా? అని అడిగా. సరే అని విసిరాడు. ఆ వెంటనే నా నోటి నుంచి ‘యే తో నాచురల్ హై’ (అతడిలో సహజ నైపుణ్యం ఉంది) అన్న మాట వచ్చింది’’ అని జైవీర్ గుర్తు చేసుకున్నారు.


ఆ తర్వాత రెండేళ్లకు నీరజ్ తన బేస్‌ను పంచకుల లోని తా దేవి లాల్ స్టేడియంకు మార్చాడు. 2015లో జాతీయ క్యాంప్ నుంచి పిలుపు వచ్చే వరకు అక్కడే శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాతి సంవత్సరం పోలండ్‌లో జరిగిన అండర్-20 విభాగంలో రికార్డు సృష్టించి తన ఊరు ఖంద్రా పేరును ప్రపంచ పటంలో నిలిపాడు.  గత ఐదేళ్లుగా నీరజ్ మరింతగా రాటుదేలాడు.  2016 గువాహటిలో జరిగిన ఏషియన్ గేమ్స్‌, 2017లో భువనేశ్వర్‌లో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించాడు. చైనాలోని జియాజింగ్‌లో జరిగిన ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ మీట్‌లో రజతం సాధించాడు. 2018లో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్, గోల్డ్ కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లలో బంగారు పతకాలు సాధించాడు.  


 నీరజ్ స్వగ్రామమైన పానిపట్‌లోని ఖంద్రా గ్రామంలో ఎక్కువమంది రైతులే. నీరజ్ తండ్రి సతీశ్ కుమార్ కూడా రైతే. ఆయనకు ఎకరాన్నర భూమి ఉంది. నీరజ్‌కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తొమ్మిది మంది పిల్లలున్న ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు. ‘‘తొమ్మిది మంది పిల్లలున్న కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమే. మాకు పొలం ఉన్నా ఎప్పుడూ నష్టాలే. గత కొన్నేళ్లుగా అయితే పంట చేతికందిందే లేదు. అయితే, నీరజ్ శిక్షణకు మాత్రం ఎప్పుడూ ఆటంకం కలగకుండా చూసుకున్నాం’’ అని నీరజ్ అంకుల్ వివరించారు. కాగా, 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.

Updated Date - 2021-08-08T02:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising