ఆఖరి ఓవర్లో అదరగొట్టిన డివిలియర్స్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..
ABN, First Publish Date - 2021-04-28T02:40:51+05:30
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు ..
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 171 పరుగులు చేసింది. ఆర్సీబీ తరపున ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్(75 నాటౌట్: 42 బంతుల్లో.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో అదరగొట్టాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో 3 సిక్స్‌లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆర్సీబీ 170కి పైగా పరుగులు చేసింది. డివలియర్స్‌తో పాటు రజత్ పాటిదార్(31: 22 బంతుల్లో.. 2 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(25: 20 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు) చక్కటి ప్రదర్శన చేశారు. మరి కాసేపట్లో 172 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగనుంది.
Updated Date - 2021-04-28T02:40:51+05:30 IST