ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను ఎప్పటికీ కోచ్ కాలేను: సునీల్ గవాస్కర్

ABN, First Publish Date - 2021-06-07T22:02:42+05:30

సునీల్ గవాస్కర్‌కున్న క్రికెట్ పరిజ్ఞానం అపారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా తొలి తరం క్రికెట్ దిగ్గజంగా, లిటిల్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న సునీల్ గవాస్కర్‌కున్న క్రికెట్ పరిజ్ఞానం అపారం. అయితే ఇప్పటివరకు ఆయన ఏ జట్టుకూ కోచ్‌గా పనిచేయలేదు. తన సహచర ఆటగాళ్లైన కపిల్ దేవ్, అజిత్ వాడేకర్, బిషన్ సింగ్ బేడీ వంటి వారు కోచ్‌లుగా పనిచేసినా గవాస్కర్ మాత్రం ఎప్పుడూ అటు వైపు దృష్టి సారించలేదు. 


దాని గురించి సునీల్ తాజాగా స్పందించాడు. `నేను కోచ్‌గా రాణించలేను. ఎందుకంటే నేను ఆటను ఎక్కువసేపు చూడలేను. నేను ఆడే రోజుల్లో కూడా మ్యాచ్ పూర్తిగా చూసేవాడిని కాదు. అవుట్ అవగానే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేవాడిని. నేను ప్రతి బంతినీ చూసే రకం కాదు. కోచ్ కావాలంటే ప్రతి బంతినీ చూడాలి. అన్నీ గమనించాలి. నేను అలా చేయలేను. నాకు కోచింగ్‌పై ఆసక్తి లేకున్నా నా వద్దకు సలహాలు, సూచనలు కోసం వచ్చే ఆటగాళ్లతో మాట్లాడేవాడిని. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో ఎంతో ఇష్టంగా నా ఆలోచనలను పంచుకునేవాడిన`ని గవాస్కర్ చెప్పాడు. 

Updated Date - 2021-06-07T22:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising