ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 ఏళ్లలో 2.5 లక్షల మందికి చికిత్స

ABN, First Publish Date - 2021-02-05T07:53:55+05:30

బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో ఇరవై ఏళ్లలో 2.5 లక్షల మందికిపైగా కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించినట్లు ఆ సంస్థ చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది కేన్సర్‌తో మృతి


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో ఇరవై ఏళ్లలో 2.5 లక్షల మందికిపైగా కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించినట్లు ఆ సంస్థ చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మంది ప్రతి ఏటా కేన్సర్‌ బారినపడి మరణిస్తున్నారని, అయితే సాధారణ కేన్సర్‌లలో మూడో వంతు నివారించదగ్గవేనన్నారు. ప్రపంచ కేన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి, మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో షౌకత్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సంయుక్తంగా గురువారం కేన్సర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనేక మందికి జబ్బు నయమై సాధారణ జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఆల్కహాల్‌, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పోలియోను దేశం నుంచి ఎలా తరిమి వేయగలిగామో, అదే విధంగా కేన్సర్‌నూ తరిమికొట్టాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సీనియర్‌ సివిల్‌ జడ్జి, కార్యదర్శి రాధాకృష్ణ చౌహాన్‌ పిలుపునిచ్చారు.  


యశోద ఆస్పత్రిలో ‘ఏఐ  ఇంటిగ్రేటెడ్‌ పెట్‌-సిటీ స్కాన్‌’

కేన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించే అత్యాధునిక ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ పెట్‌-సిటీ స్కాన్‌’ను యశోద ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. వరల్డ్‌ కేన్సర్‌ డే సందర్భంగా ఈ పెట్‌-సిటీని గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్‌ను ముందుగా గుర్తించడంతోపాటు పాతతరాల పెట్‌-సిటీ కంటే ఇప్పుడు రెండు రెట్లు వేగంగా, తక్కువ స్కానింగ్‌ వ్యవధి, తక్కువ రేడియేషన్‌ మోతాదుతో అత్యుత్తమ, నాణ్యమైన ఫిల్మ్‌ను అందిస్తుందన్నారు. తమ ఆస్పత్రిలో ప్రపంచ స్థాయి కేన్సర్‌ చికిత్స కోసం సమగ్ర న్యూక్లియర్‌ మెడిసిన్‌ అందుబాటులో ఉందని, యశోద గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీ.ఎస్‌. రావు తెలిపారు. 



సినిమాల్లో సిగరెట్లు తాగడం తగ్గించేశా:  సుమంత్‌

‘సినిమాల్లో సిగరెట్లు తాగడం తగ్గించేశా... సీన్‌ ఎవరైనా పెడితే వద్దంటున్న... ఇక్కడ అవసరమా అని ఆ సీన్‌ ఉండకుండా ప్రయత్నం చేస్తున్నా’ అని నటుడు సుమంత్‌ అన్నారు. వరల్డ్‌ కేన్సర్‌ డేను పురస్కరించుకొని మెడికవర్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.


Updated Date - 2021-02-05T07:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising