డెయిరీ, పౌల్ట్రీలకు ఆస్తి పన్ను రద్దు
ABN, First Publish Date - 2021-06-03T07:50:03+05:30
రాష్ట్రంలోని డెయిరీ, పౌలీ్ట్ర రైతులకు శుభవార్త. డెయిరీ (పాడి), పౌలీ్ట్ర (కోళ్ల ఫారం)లకు సంబంధించిన ఆస్తి పన్నును ప్రభుత్వం రద్దు చేసింది
రూ.100 చెల్లిస్తే చాలు.. మిగతా మొత్తం మాఫీ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రావతరణ రోజున రైతులకు సర్కారు కానుక
పౌలీ్ట్ర, డెయిరీలకు విద్యుత్తు సబ్సిడీ కూడా..
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డెయిరీ, పౌలీ్ట్ర రైతులకు శుభవార్త. డెయిరీ (పాడి), పౌలీ్ట్ర (కోళ్ల ఫారం)లకు సంబంధించిన ఆస్తి పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఏడాదికి రూ.100 చెల్లిస్తే చాలు. మిగతా పన్ను మొత్తం మాఫీ చేస్తూ మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రావతరణ దినోత్సవాన డెయిరీ, పౌలీ్ట్ర రైతులకు ప్రభుత్వం కానుక ఇచ్చింది. గ్రామ పంచాయతీల పరిఽధిలో ఈ పన్నును రద్దు చేస్తూ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా నోటిఫికేషన్ జారీ చేశారు.
పంచాయతీరాజ్ చట్టం-2018ని అనుసరించి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ మునిసిపల్ చట్టం-2019, జీహెచ్ ఎంసీ యాక్ట్-1955ను అనుసరించి మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో వేలాది మంది డెయిరీ, పౌలీ్ట్ర రైతులకు ప్రభుత్వ నిర్ణయం ద్వారా మేలు జరగనుంది. కాగా, పౌలీ్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం బుధవారం ఉదయం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. డెయిరీ, పౌలీ్ట్ర ఫాంల ఆస్తి పన్నును రద్దు చేయాలని, దాణాను సబ్సిడీపై అందించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. ఆస్తి పన్ను రద్దుపై వెంటనే ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశించారు. కాగా, డెయిరీ, పౌలీ్ట్రలకు ఆస్తి పన్ను రద్దుతో సంబంధిత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ రంగంలోకి కొత్త వారు రావడానికీ దోహదపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలిస్తున్నారన్నారు.
పౌలీ్ట్ర, డెయిరీకి యూనిట్‌కు రూ.2ల సబ్సిడీ
రాష్ట్రంలోని పౌలీ్ట్ర, డెయిరీ రైతులు వినియోగించే కరెంట్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా బుధవారం జీవో జారీ చేశారు. ప్రస్తుతం పౌలీ్ట్రలకు యూనిట్‌కు రూ.6 చొప్పున, డెయిరీలకు యూనిట్‌కు రూ.4 చొప్పున వసూలు చేస్తున్నాయి. తాజా నిర్ణయంతో పౌలీ్ట్రలకు రూ.4, డెయిరీ ఫాంలకు యూనిట్‌కు రూ.2 వసూలు చేయనున్నారు.
Updated Date - 2021-06-03T07:50:03+05:30 IST