కన్నుల పండువగా పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
ABN, First Publish Date - 2021-06-26T06:56:48+05:30
ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రా మంలో శుక్రవారం ముత్యాలపోచమ్మ, నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా జరిగింది.
భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు
ఖానాపూర్ రూరల్, జూన్ 25 : ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రా మంలో శుక్రవారం ముత్యాలపోచమ్మ, నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా జరిగింది. నూతనంగా రెండు వేరు వేరుగా గ్రామంలో ముత్యాల పోచమ్మ, గ్రామపొలిమేరలో నల్లపోచమ్మ ఆలయాలు నిర్మించారు. వేదపండితు ల వేదమంత్రోచ్ఛారణతో కార్యక్రమం నిర్వహించారు. మంగళవాయిద్యాలతో విగ్రహాలను ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చారు. ఉదయం విగ్రహాల ఊరేగింపు, పుణ్యవాచనం, అభిషేకం, యజ్ఞం, ప్రాణప్రతిష్ఠ, విగ్రహస్థాపన కార్య క్రమాలు యజ్ఞచార్యులు చక్రపాణి నరసింహమూర్తి, అర్చకులు కోటపెల్లి అనీష్ వేదమంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. స్థానిక ప్రజలే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వచ్చి పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించు కున్నారు. భక్తిశ్రద్దలతో పూజలు చేసారు. కార్యక్రమంలో జడ్‌పీటీసీ ఆకుల రాజమణి వెంకాగౌడ్, ఎంపీటీసీ జంగిలి సరితశంకర్, ఉపసర్పంచ్ హరీష్, గ్రామపెద్దలు చెప్పాల వెంకట్రాజం తదితరులు పాల్గొని పూజలు చేసారు.
Updated Date - 2021-06-26T06:56:48+05:30 IST