ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా కేంద్రం వరకు డబుల్‌ రోడ్డు కల నెరవేరేనా?

ABN, First Publish Date - 2021-12-20T03:56:55+05:30

ఎన్నో ఏళ్లుగా ప్రధాన రోడ్డుతో కోసం ఎదురుచూస్తున్న మండలవాసుల కల నెరవేరడం లేదు. యేటా ఎన్నికలు వస్తేనే ఏజెన్సీ గ్రామాలు, గిరిజన సమస్యలు నెరవేరుస్తామని హామీలిచ్చే నాయకులకు ఈ సమస్య కనిపించడం లేదు.

కంకర వేసి అర్థాంతంగా వదిలి వేసిన రోడ్డు పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఐదేళ్ల క్రితం మంజూరైన రోడ్డు

- నేటికీ పూర్తి కాని వైనం

- అత్యవసర పనులకు ఇక్కట్లు

- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

తిర్యాణి, డిసెంబరు 19: ఎన్నో ఏళ్లుగా ప్రధాన రోడ్డుతో కోసం ఎదురుచూస్తున్న మండలవాసుల కల నెరవేరడం లేదు. యేటా ఎన్నికలు వస్తేనే ఏజెన్సీ గ్రామాలు, గిరిజన సమస్యలు నెరవేరుస్తామని హామీలిచ్చే నాయకులకు ఈ సమస్య కనిపించడం లేదు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్డుసౌకర్యం కల్పించేందుకు  భారీ నీటిపారు దలశాఖ మంత్రి హరీష్‌రావు రూ.32 కిలోమీటర్ల డబుల్‌లైన్‌ రోడ్డుకు రూ.32 కోట్లతో శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మా ణానికి ఐదేళ్లక్రితం నిధులు కూడా మంజూ రయ్యాయి. రెండేళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు. కానీ నేటికీ పనులు పూర్తికాలేదు. దీంతో మండలానికి జిల్లా కేంద్రానికి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.

నత్తనడకన కొనసాగుతున్న పనులు..

జిల్లా కేంద్రం నుంచి దాంపూర్‌ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరో 25కిలోమీటర్లు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కైరిగూడ, గిన్నెఽ దరి, గడల్‌పల్లి గ్రామాల్లో మొరం, కంకరపోసి వదిలేశారు. దీంతో ఎటు వెళ్లాలన్న ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని వాహనదారులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు నెలకు రెండుమూడు సార్లు మరమ్మతులు చేసుకోవాల్సి వస్తోందని యజమా నులు  పేర్కొంటున్నారు. వేసిన రోడ్డుకు వాటర్‌ క్యూరింగ్‌ చేయకపోవడంతో ఆయాగ్రామాల ఇళ్లలోకి దుమ్ము ధూళి చేరుతోంది. ఈ విషయంపై సంబం ధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు కాంట్రాక్టర్లు రోడ్డును బాగు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

పనులు పూర్తయ్యేలా చూడాలి..

- వెడ్మ నరేష్‌, గిన్నెధరి

అధికారులు డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తయ్యేలా చూడాలి. మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే 4,5గంటల సమయం పడుతోంది. కొన్నిసార్లు బండ్లు చెడిపోయి మార్గమధ్యలోనే వదిలేయాల్సి వస్తోంది. మా కష్టాలు దూరం చేసేలా చర్యలు తీసుకోవాలి.

అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడుతున్నాం..

- కుమరం తానుబాయి, కేరేగూడ

కైరిగూడ, తిర్యాణి, జిల్లాకేంద్రానికి పనుల కోసం వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదు. ప్రజాప్రతినిధులు, ఆఫీ సర్లకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందిం చడంలేదు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును త్వరగా వేసేలా చూడాలి.

Updated Date - 2021-12-20T03:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising