ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-05-19T03:55:38+05:30

జిల్లాలో కొవిడ్‌-19 బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ, సింగరేణి సమన్వయంతో మెరుగైన వైద్య సేవలు అం దించాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో సింగరేణి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లాలో కొవిడ్‌ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ భారతి హొళికేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంచిర్యాల కలెక్టరేట్‌, మే 18: జిల్లాలో కొవిడ్‌-19 బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ, సింగరేణి సమన్వయంతో మెరుగైన వైద్య సేవలు అం దించాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో సింగరేణి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లాలో కొవిడ్‌ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలోని వైద్యులు, వైద్య సిబ్బంది కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వారితో స్నేహపూర్వకంగా మెదలాలని, విధి నిర్వహణలో సమ యపాలన పాటించాలన్నారు. రోగి రికవరీ అయ్యేం త వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వ్యాధిపై భయాందోళనలు తొలగించి వారికి మనోధైర్యం నిం పేలా అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని, సింగరేణి, ప్రభుత్వం శాఖ తారతమ్యం లేకుండా కరోనా బాధితులకు పారిశుధ్యం, భోజనం, వైద్యం అందించడంలో సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. సింగరేణి జీఎం వైద్యాధికారులను సమావేశపరిచి ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. పారిశుధ్య సిబ్బంది, వార్డు బాయ్స్‌ సెకండ్‌ గ్రేడ్‌ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని, బెల్లంపల్లిలో నాలుగు వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ ఉన్నా యని, ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న అందరికి సదుపాయాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కరోనాకు సంబంధించిన వివరాలను ప్రతీరోజు నివేదిక అందించాలని, లక్షణాలున్న వారిని అడ్మిట్‌ చేసుకోవాలని సూచించారు. పాజిటివ్‌ లక్షణాలు కనిపించినట్లయితే మెడికల్‌ కిట్‌ అందించి హోం ఐసోలేషన్‌లో పాటించాల్సిన నిబంధనలను తెలియజేయాలని, కరోనా కట్టడికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ అరవింద్‌, సింగరేణి సంస్థ గోలేటి ఏరి యా జీఎం శ్రీనివాస్‌, డిప్యూటీ సీఎంఓ డా.శౌర్య, రాధాకృష్ణ, అనిల్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-19T03:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising