ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులతో పోటెత్తిన ‘పూసాయి ఎల్లమ్మ’

ABN, First Publish Date - 2021-02-08T05:56:55+05:30

మండలంలోని పూసాయి గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తులతో పూసాయి ఎల్లమ్మ జాతర జన సంద్రంగా మారింది. పుష్యమాసం నుంచి మాగ మాసం వరకూ నెల రోజుల పాటు జాతర కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌, ఫిబ్రవరి7: మండలంలోని పూసాయి గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తులతో పూసాయి ఎల్లమ్మ జాతర జన సంద్రంగా మారింది. పుష్యమాసం నుంచి మాగ మాసం వరకూ నెల రోజుల పాటు జాతర కొనసాగుతోంది. ఆదివారం జిల్లా నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వందలాది మంది భక్తులు హాజరై పూజలు చేశారు. ఆలయం ఎదుట ఉన్న కోనేరులో స్నానమాడి, ఎల్లమ్మ తల్లికి మేకలు, కోళ్లను బలిచ్చి ప్పరజలను పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పూసాయి గ్రామస్థులు డప్పులు, భజాల మధ్య మేకలు, కోళ్లను ఎల్లమ్మ తల్లికి బలిచ్చి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై సాయిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2021-02-08T05:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising