‘అధికారుల సమస్యలను పరిష్కరించాలి’
ABN, First Publish Date - 2021-12-18T19:17:37+05:30
సంస్థ లక్ష్యాలను సాధించే క్రమంలో ఏర్పడుతున్న అధికారుల సమస్యలపై స్పందించి పరిష్కంచాలని కోరుతూ.. కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ అధ్యక్షుడు
- బ్రాంచ్ అధ్యక్షుడు రమేష్‌కు ఏరియా అసోసియేషన్ వినతి
మణుగూరుటౌన్(భద్రాద్రి కొత్తగూడెం): సంస్థ లక్ష్యాలను సాధించే క్రమంలో ఏర్పడుతున్న అధికారుల సమస్యలపై స్పందించి పరిష్కంచాలని కోరుతూ.. కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ అధ్యక్షుడు జక్కం రమేష్‌కు మణుగూరు ఏరియా అసోసియేషన్ అధికారులు వినతిపత్రమందజేశారు. శుక్రవారం ఏరియాలోని ఇల్లెందు క్లబ్‌లో అసోసియేషన్ సింగరేణి స్థాయి అధికారుల సంఘం సమావేశం అధ్యక్షుడు రమేష్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు వినతిపత్రమందజేసిన అధికారులు పలు సమస్యలను అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాదించడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సింగరేణిలో డైరెక్టర్ పీఅండ్‌పీ పోస్ట్ భర్తీ కాకపోవడంతో ప్రణాళికలు, ఆదేశాలు జారీ కాక పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించిన సమయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటూనే తమని కూడా బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశంలో గత రెండున్నర ఏళ్లల్లో అసోసియేషన్ సాధించిన విషయాలు, అధికారులకు ఇచ్చిన చార్జ్ షీట్‌లను రద్దు చేయించడం, పెండింగ్‌లో ఉన్న అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరా మయ్యేల యాజ మా న్యం తో చర్చించే విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా అద్యక్షుడు రమేష్ మాట్లాడుతూ.. సభ్యుల సమస్యలను యాజ మాన్యం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రాజశే ఖర్‌రావు, ఉపాధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, ఏవీ రెడ్డి, ఏరియా అధికారులు లలిత్‌కుమార్, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాసచారి, నాగేశ్వరరావు, మాలోత్ రాముడు, వీరభద్రుడు, లింగబాబు, చిట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2021-12-18T19:17:37+05:30 IST