ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవీందర్‌ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-07-12T07:16:06+05:30

తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ రవీందర్‌ స్ఫూర్తితో సంస్థాన్‌ నారాయణపురం మండలానికి చెందిన విద్యార్థులు చదువులో రాణించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు.

తెలంగాణ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ రవీందర్‌గుప్తాను సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభార్‌, ప్రజాప్రతినిఽధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్థాన్‌ నారాయణపురం, జూలై11: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ రవీందర్‌ స్ఫూర్తితో సంస్థాన్‌ నారాయణపురం మండలానికి చెందిన విద్యార్థులు  చదువులో రాణించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన రవీందర్‌గుప్తా తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.  ఈ సంద ర్భంగా సంస్థాన్‌ నారాయణపురం సర్పంచ్‌ శికిలమెట్ల శ్రీహరి ఆధ్వర్యంలో రవీందర్‌గుప్తాకు మండల కేంద్రంలో ఆదివారం  పౌర సన్మానం చేశారు.  ఈ సందర్భంగా రవీందర్‌ గుప్తాను కర్నె ప్రభాకర్‌తో పాటు ప్రజాప్రతిని ధులు, నాయకులు సన్మానిం చారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్‌ మాట్లా డారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి ‘యంగ్‌ సైంటిస్‌’్ట అవార్డు పొందిన ఘనత రవీందర్‌గుప్తాకు ఉందన్నారు.  రవీందర్‌గుప్తా మాట్లా డుతూ ఏ స్థాయిలో ఉన్నా స్వగ్రామం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. కష్టపడి విద్యార్థులు చదివితే ఏదైనా సాధించవచ్చని, ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. ఈ ప్రాంతం వారు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో  ఉన్నారని, అలాంటి గ్రామంలో జన్మించడం ఎంతో గర్వ కారణంగా ఉందన్నారు. ఈకార్యక్ర మంలో సర్పంచ్‌ శికిలమెట్ల శ్రీహరి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత సంపత్‌ కుమారాచార్య, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు తది తరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-12T07:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising