ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు వ్యవసాయానికి రంగంలోకి దిగిన గిరిజనులు

ABN, First Publish Date - 2021-01-14T03:54:32+05:30

కవ్వాల టైగర్‌జోన్‌ పరిధిలోని జన్నారం బీట్‌ గడ్డంగూడ అటవీ ప్రాంతంలో గతంలో పోడు వ్యవసాయానికి చదును చేసిన ప్రాంతానికి పట్టాలివ్వాలని గిరిజనులు, గిరిజనేతరులు రెండు రోజులుగా యత్నిస్తు న్నారు.

గిరిజనులతో మాట్లాడుతున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, జనవరి 13: కవ్వాల టైగర్‌జోన్‌ పరిధిలోని జన్నారం బీట్‌ గడ్డంగూడ అటవీ ప్రాంతంలో గతంలో పోడు వ్యవసాయానికి చదును చేసిన ప్రాంతానికి పట్టాలివ్వాలని  గిరిజనులు, గిరిజనేతరులు రెండు రోజులుగా యత్నిస్తు న్నారు. బుధవారం  సుమారు 200 మందికి పైగా గిరిజ నులు రాగా అటవీ, పోలీసు అధికారులు వారిని అడ్డు కున్నారు.  గిరిజనులు, గిరిజనేతరులు మాట్లాడుతూ 1997లో కంపార్ట్‌మెంట్‌ 308లో 300 ఎకరాలకు పైగా సాగు చేసుకునేందుకు చదును చేశామని, అప్పటి అటవీ శాఖాధికారులు, పోలీసులు అడ్డు కొని జైళ్ళకు పంపారని, అయితే ఇటీవల వేరే గ్రామాలకు చెం దిన కొందరికి ఈ అటవీ ప్రాంతంలో భూములిచ్చేందుకు పట్టాలు మంజూరయ్యాయన్నారు. జైళ్ళకు వెళ్ళిన వారికి కాకుండా భూములున్న వారికే పట్టాలు ఎలా ఇస్తారన్నారు.  ఇటీవల ఐటీడీఏ సర్వే బృందం వచ్చిందని, అందులో కూడా కొందరికే భూములను కేటాయించే విధంగా చూశారన్నారు.   ఎఫ్‌బీఓ మాధవరావు, మంచిర్యాల సీఐ కుమారస్వామిలు మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా పీఓ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, టైగర్‌జోన్‌లో భూములను ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. అయినా వారు వినకపోవ డంతో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వెనుదిరిగారు. గిరిజ నులు మాట్లాడుతూ ఎప్పటికైనా ఈ భూమిని సాగు చేస్తా మని తేల్చి చెప్పారు.  జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్సైలు మధుసూదన్‌రావు, తానాజీ, శ్రీకాంత్‌లతోపాటు ప్రొబెషనరీ ఎస్సైలు, అడిషనల్‌ ఎస్సైలతో పాటు అటవీ శాఖ సిబ్బంది  పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T03:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising