ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గీతం స్మార్ట్‌ ఐడియాథాన్‌ విజేత ఐఐటీ ఖరగ్‌పూర్‌

ABN, First Publish Date - 2021-06-21T10:07:15+05:30

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వెంచర్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (వీడీసీ) జాతీయస్థాయిలో నిర్వహించిన స్మార్ట్‌ ఐడియాథాన్‌ - 2021 పోటీల ఫైనల్స్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ జట్టు విజేతగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజేతలను అభినందించిన వీసీ ప్రొఫెసర్‌ శివరామకృష్ణ

పటాన్‌చెరు రూరల్‌, జూన్‌  20: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వెంచర్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (వీడీసీ) జాతీయస్థాయిలో నిర్వహించిన స్మార్ట్‌ ఐడియాథాన్‌ - 2021 పోటీల ఫైనల్స్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ జట్టు విజేతగా నిలిచింది. రూ.లక్ష నగదు బహుమతిని, టైటిల్‌ను ఆ జట్టు కైవశం చేసుకొంది. దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన 90 కాలేజీల నుంచి 250 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయని గీతం చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ ఎన్‌.క్రిష్‌ తెలిపారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రథమస్థానం సాధించగా జి.హెచ్‌. రాయసోనీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ద్వితీయ స్థానంలో, గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ తృతీయ స్థానంలో నిలిచాయని చెప్పారు. కరోనాతో ఇటీవల మృతిచెందిన వీడీసీ డైరెక్టర్‌ లెబెన్‌ జాన్సన్‌ పేరిట నెలకొల్పిన అవార్డు గీతం వైద్య కళాశాల విద్యార్థి బృందానికి లభించిందన్నారు.


ఈ సందర్భంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ మాట్లాడుతూ... యువతలో నూతన ఆలోచనలను పెంపొందించి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. గీతం స్మార్ట్‌ ఐడియాథాన్‌ విజేతలను ఆయన అభినందించారు. గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ మాట్లాడుతూ.. సరికొత్త ఆలోచనలను విజయవంతమైన స్టార్ట్‌పగా మలచడానికి సరైన బృందం అవసరమన్నారు. వినియోగదారుల అవసరాలు, మార్కెట్‌ అధ్యయనం, పెట్టుబడుల సమీకరణ అంశాలపై లోతైన అవగాహన ఉంటే స్టార్ట్‌పలు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-21T10:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising