ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైన్‌స్నాచింగ్‌కు యత్నించిన వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2021-12-08T05:34:12+05:30

చైన్‌స్నాచింగ్‌కు యత్నించిన వ్యక్తి అరెస్టు

నిందితుడి అరెస్టు చూపిస్తున్న డీసీపీ పుష్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ క్రైం, డిసెంబరు 7: వరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ లాడ్జిలో పనిచేస్తూ చైన్‌స్నాచింగ్‌కు యత్నించి సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన  యువకుడిని   వరంగల్‌ సీసీఎస్‌, మిల్స్‌కాలనీ పోలీసులు సంయుక్తం గా అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.15వేల విలువ గల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మట్టెవాడలోని సీసీఎస్‌ పోలీసు కార్యాలయంలో సెంట్రల్‌జోన్‌ డీసీపీ పుష్ప నిందితుడిని మీడియాకు చూపించి వివరాలను వెల్లడించారు. 

వరంగల్‌ లేబర్‌కాలనీకి చెందిన బొంత అన్వేష్‌ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మమ్మ వద్ద ఉండి పదోతరగతి వరకు చదువుకున్నాడు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉండే ఓ లాడ్జిలో రూమ్‌బాయ్‌గా పనిలో చేరాడు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేవారు. వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ జులాయిగా తిరిగేవాడు. పోలీసులు పట్టుకుని జైలుకు తరలించగా బెయిల్‌పై విడుదలై వచ్చాడు. చేసిన అప్పును తీర్చేందుకు తిరిగి అదే లాడ్జిలో పనిలో చేరాడు. గత నవంబరు 29న సాయంత్రం సమయంలో లాడ్జి ముందు నుంచి ఓ మహిళ ఒంటరిగా వెళుతుండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోబోయాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ కేకలు వేస్తూ అన్వేష్‌ చొక్కా పట్టుకుంది. వెంటనే అన్వేష్‌ చైన్‌ వదిలేసి ఆమె చేతిలో ఉన్న విలువైన ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. మహిళ చేతికి అన్వేష్‌ చొక్కా గుండీలు చిక్కాయి. 

వెంటనే బాధితురాలు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం వరంగల్‌ దయానందకాలనీలో ఉన్నట్టు తెలుసుకుని అన్వే్‌షను అరెస్టు చేశారు. విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కేసులో ప్రతిభ కనబరిచిన క్రైం ఏసీపీ బాబురావు, ఇన్స్‌పెక్టర్‌ ఎల్‌. రమే్‌షకుమార్‌, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది శ్రీనివా్‌సరాజు. రవికుమార్‌, శర్భోద్దీన్‌, జంపయ్య, అలీ, వేణుగోపాల్‌లను డీసీపీ పుష్ప అభినందించారు.

Updated Date - 2021-12-08T05:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising