బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
ABN, First Publish Date - 2021-08-03T00:13:27+05:30
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేయాలని
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా పాదయాత్ర వాయిదావేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. సొంత నియోజకవర్గానికి కాకుండా ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లకు మొదటగా వెళ్లాలని కేంద్రమంత్రులకు కాషాయపార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి, విజయవాడ, భద్రాచలం పర్యటనకు కిషన్ రెడ్డి వెళ్లనున్నారు.
Updated Date - 2021-08-03T00:13:27+05:30 IST