కూష్కాండ రూపంలో బాసర సరస్వతీ దేవి
ABN, First Publish Date - 2021-10-11T03:03:30+05:30
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారు నాలుగో రోజైన ఆదివారం కూష్మాండ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాసర సరస్వతీ
బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారు నాలుగో రోజైన ఆదివారం కూష్మాండ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. దసరా ఉత్సవాల్లో నాలుగో రోజు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచీ భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఆదివారం సెలవు దినానికి తోడు అక్షర శ్రీకార పూజలకు మంచి ముహూర్తం ఉండడంతో భక్తుల రద్దీ పెరిగింది. అక్షర శ్రీకార పూజలు పెద్ద సంఖ్యలో జరిగాయి.
Updated Date - 2021-10-11T03:03:30+05:30 IST