ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ స్ఫూర్తితో వనరులను కాపాడుకోవాలి: సీఎం

ABN, First Publish Date - 2021-10-14T08:19:15+05:30

పూల పండుగ బతుకమ్మ చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రప్రజలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పూల పండుగ బతుకమ్మ చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతీ-సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 


సద్దుల బతుకమ్మ ఆడిన సీఎం సతీమణి

ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌లో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సతీమణి శైలిమతో పాటు వారి కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడారు.

Updated Date - 2021-10-14T08:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising