ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్ట్ 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

ABN, First Publish Date - 2021-07-04T20:04:40+05:30

ఆగస్ట్ 9 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ప్రకటించారు. నగరంలోని భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఆగస్ట్ 9 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ప్రకటించారు. నగరంలోని భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించి..  హుజురాబాద్‌లో ముగించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే పాదయాత్ర చేపట్టినట్టు ఆయన అన్నారు. 


రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన.. జల వివాదంపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక ప్రకారమే ఇద్దరు ముఖ్యమంత్రులు సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని అన్నారు. హుజురాబాద్‌లో రాజకీయ లబ్ధి కోసమే జగన్‌తో కేసీఆర్ రాజీపడ్డారని విమర్శించారు. కృష్ణానది జలాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అని  కేసీఆర్ రాసిన లేఖ బూటకం అన్నారు. కేసీఆర్ తీరు వలనే తెలంగాణకు 575 టీఎంసీల రావాల్సిన చోట 299 టీఎంసీలకు పరిమితం చేశారన్నారు. కేసీఆర్ ఎన్ని కోట్లు పెట్టినా.. హుజురాబాద్‌లో గెలిచేది ఈటల రాజేందర్ మాత్రమేనన్నారు. చాలా ఈజీగా బీజేపీ హుజురాబాద్‌లో గెలవబోతోందన్నారు. దుబ్బాక మాదిరిగానే బీజేపీ ఉత్సాహంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు ఎన్నికల్లో ఓడినంత మాత్రానా వెనకడుగు వేసినట్లు కాదని, కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు.  హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత సాధికారత సమావేశమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో దళితులకు రక్షణ కరువని పేర్కొన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, 125 అడుగల అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు ఎటు వెళ్ళాయో కేసీఆర్ చెప్పాలన్నారు. ఉచిత వ్యాకిన్, రేషన్ బియ్యం కేంద్రం ఇస్తున్నా ప్రధాని మోదీ ఫోటో‌ను పెట్టడం లేదన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.


బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్


బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ విడుదలైంది. ఆగస్ట్ 9న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర దారిలోనే బండి సంజయ్ కూడా నడవనున్నారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో మొదట విడత పాదయాత్ర జరగనుంది. మొదట విడతలో 55రోజుల పాటు 750కిలోమీటర్ల పాదయాత్ర జరగనుంది. రోజుకు 15నుంచి 20కిలోమీటర్లు నడవనున్నారు. పాతబస్తీ, ఆర్యమైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా పాదయాత్ర జరగనుంది. మొదటి విడత పాదయాత్రను హుజురాబాద్‌లో ముగించనున్నారు.  


ఇదిలా ఉంటే,  నాలుగైదు విడతల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజున మొదటి విడత పాదయాత్ర మొదలై అక్టోబర్ 2న గాంధీ జయంతిన ముగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రానున్న రెండున్నరేళ్ళు పాదయాత్రలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 


Updated Date - 2021-07-04T20:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising