కేంద్ర గైడ్‌లెన్స్‌ను తప్పకుండా పాటించాలి: హైకోర్టు
ABN, First Publish Date - 2021-12-31T21:26:28+05:30
న్యూఇయర్ వేడుకలు, ఒమైక్రాన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా జీవో రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలు, ఒమైక్రాన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా జీవో రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. కేంద్ర గైడ్‌లెన్స్‌ను తప్పకుండా పాటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టెస్టుల పెంపుతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒమైక్రాన్ పరిస్థితులపై జనవరి 3లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 4కి హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2021-12-31T21:26:28+05:30 IST