ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటెలది అస్తిత్వం కోసం ఆరాటం: వినయ్ భాస్కర్

ABN, First Publish Date - 2021-06-15T22:46:51+05:30

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేస్తున్నది ఆత్మగౌరవ పోరాటం కాదని, కేవలం అస్తిత్వం కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేస్తున్నది ఆత్మగౌరవ పోరాటం కాదని, కేవలం అస్తిత్వం కోసం ఆరాటమేనని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో ఈటల చేరారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీలో ఈటెల చేరడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ను కాదని వెళ్లిన వారు కనుమరుగు అయ్యారని గతాన్ని ఆయన గుర్తు చేశారు. కమలం వాడిపోయిన పువ్వు అని అయన పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీలోకి వెళ్లిన వారు తిరిగి తమ సొంత పార్టీలలోకి వెనక్కి వస్తున్నారని ఆయన ఉదహరించారు.


 ఐదేళ్ల క్రితమే బీజేపీలో చేరడానికి ఈటల స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల క్రితమే కేసీఆర్‌తో గ్యాప్ వస్తే రెండేళ్ల క్రితం ఇచ్చిన మంత్రి పదవిని, రైతు బంధును ఎందుకు తీసుకున్నారని ఈటలను ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నియంత అయితే మాతో కలిసి ఎందుకు భోజనం చేస్తారని ఆయన అన్నారు. ఈటెల ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని తాము భావించామన్నారు. మా అందరికంటే ఎక్కువ పదవులను నీకే కేసీఆర్ ఇచ్చారని ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు బీజేపీలో చేరినవా అని ఈటలను ఆయన ప్రశ్నించారు. బీజేపీలో ఎందుకు చేరిండో ఈటెల సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తరుణ్ చుగ్ లాంటి వారు మండలానికో నేత వచ్చినా టీఆర్ఎస్ పునాదులను పెకిలించలేరన్నారు. టీఆర్ఎస్‌ను గద్దె దించుతామంటే ప్రజలు క్షమించరన్నారు. 

Updated Date - 2021-06-15T22:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising