ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్ బుక్ చేసేందుకు మిస్డ్ కాల్ చేయండి

ABN, First Publish Date - 2021-01-03T00:52:58+05:30

ఇండియన్ ఆయిల్ వంట గ్యాస్ వినియోగదారులు రీఫిల్ ను బుక్ చేసుకోవడం సులువయ్యిందని పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట: ఇండియన్ ఆయిల్ వంట గ్యాస్ వినియోగదారులు రీఫిల్ ను బుక్ చేసుకోవడం సులువయ్యిందని పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తెలిపారు. శనివారం నారాయణ పేట జిల్లా లో కొందరు వినియోగ దారులు ఆయనకు వంట గ్యాస్ కు సంబంధించి పలు ఇబ్బందులు, ఫిర్యాదులు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్ డేన్ వినియోగదారులు ఇక మీదట మరింత  తేలిగ్గా గ్యాస్ బండ బుక్ చేసుకోవచ్చన్నారు. 8454955555 నంబర్ కు మిస్డ్ కాల్ చేస్తే చాలు రీఫిల్ బుక్ అవుతుందని తెలిపారు.


గ్యాస్ డెలివరీ చేసే వాళ్ళు సమయానికి అందుంచక పోవడం, బుక్ చేసినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంటూ..కొందరు ప్రజలు ఈ సమస్య వల్ల గ్యాస్ డెలివరీ బాయ్స్ చేతుల్లో నే అంతా ఉంటుందని భావించి వారిని తమకు ఎలాగైనా గ్యాస్ ఇవ్వాలంటూ ప్రాధేయ పడటం, కొన్ని సందర్భాల్లో అధికంగా డబ్బులు ఇచ్చి గ్యాస్ ను పొందటం వంటివి జరుగుతున్నాయని రఘునందన్ కు వివరించారు. 


పైసలు ఎవ్వరికీ ఉత్తగానే రావని, ప్రతీ పైసా వారి వారి కష్టార్జితమే అని సూచిస్తూ.. గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో నిర్ణీత మొత్తం చెల్లించాలని, అందుకు తగిన రసీదు అడిగి తీసుకోవాలని చెప్పారు.వినియోగదారులు మొహమాటం తోనో భేషజం తో నో ఉంటే నష్టపోవదానికి, ఆస్కారం కలిగించిన వారు అవుతారని చెప్పారు. అందుకే ప్రతీ వినియోగ దారులు ఒక ఫోన్ నంబర్ ను చమురు / గ్యాస్ సంస్థలకు కేటాయిస్తే అదే నంబర్ కు తగిన సరైన సూచనలు, సలహాలు అంది ఫిర్యాదులు సైతం చేసే అవకాశం ఆ నంబర్ ద్వారా సాధ్య మౌతుందని ఆయన స్పష్టం చేశారు.


Updated Date - 2021-01-03T00:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising