ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారం కోసం ఎంతకైనా తెగించే మనిషి.. కేసీఆర్‌పై ఈటల

ABN, First Publish Date - 2021-06-23T18:53:13+05:30

సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఈటల రాజేందర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బుధవారం హాజరైన ఈటల రాజేందర్... కేసీఆర్ పని తీరును ఎండగట్టారు. ఒడ్డు ఎక్కేదాక ఓడమల్లన్న.. ఒడ్డు ఎక్కిన తరువాత బోడ మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తారని మండిపడ్డారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే మనిషి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఎన్నికలకు వస్తారన్నారు. హుజూరాబాద్ ప్రజల ప్రేమ ముందు కేసీఆర్ డబ్బులు, కుట్రలు పని చేయవన్నారు. 


‘‘నేను ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెళుతున్నా. కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడు. తెనేపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజూరాబాద్ ప్రజలు సహించరు. నువ్వు కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలవవచ్చు. కోట్లు కుమ్మరించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ గెలవచ్చు. కానీ హుజూరాబాద్‌లో నీ కుట్రలు సాగవు బిడ్డా’’ అంటూ ఫైర్ అయ్యారు. 



Updated Date - 2021-06-23T18:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising