ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి

ABN, First Publish Date - 2021-01-11T04:44:57+05:30

రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి

చిరిగిన గోనెసంచులను చూపుతున్న ప్రభాకర్‌, కేంద్రం నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌

గోవిందరావుపేట, జనవరి 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్‌ అన్నారు. మండలంలోని మచ్చాపూర్‌లో గల ఐకేపీ కొనుగోలు కేంద్రానికి చిరిగిన గోనెసంచులు సరఫరా చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి గోనెసంచులను పరిశీలించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయని అన్నారు. వాతావరణం అనుకూలించక వరదలకు పంటలు కొట్టుకుపోయినా నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. అలాగే గిట్టుబాటు ధర విషయంలోనూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన గోనెసంచులను సరఫరా చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐకేపీ నిర్వాహకులు నాగమణి, దోనె జ్యోతి, కాంగ్రెస్‌ నాయకులు, రైతులు దరిపెల్లి శశిరేఖ, నూనె జయమ్మ, గణేష్‌, పిన్నింటి ఇంద్రారెడ్డి, కుమ్మరికుంట్ల రామస్వామి, చాగంటి సంపత్‌, వల్లాల మొగిలి, మడతనపెల్లి రాజన్న, కె.కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-11T04:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising