సెల్లార్‌లోకి దూసుకెళ్లి కంటైనర్ బోల్తా.. కార్మికులు దుర్మరణం
ABN, First Publish Date - 2021-02-23T23:42:56+05:30
నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ సెల్లార్‌లోకి కంటైనర్ దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు దుర్మరణం చెందారు. గాయపడిన..
హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ సెల్లార్‌లోకి కంటైనర్ దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు దుర్మరణం చెందారు. గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేట్‌బషీర్‌బాద్ పీఎస్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కంటైనర్‌ను బయటకు తీశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Updated Date - 2021-02-23T23:42:56+05:30 IST