ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే

ABN, First Publish Date - 2021-02-07T08:41:02+05:30

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా శనివారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్కా జామ్‌ పేరిట ఎక్కడికక్కడ ఆందోళనలు..

కదం తొక్కిన కాంగ్రెస్‌, రైతు సంఘాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా శనివారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, వాటి అనుబంధ సంఘాలు, రైతుసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చక్కా జామ్‌ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో జాతీయ రహదారులు, ప్రధాన రహదారులను దిగ్బంధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. కేంద్రం వైఖరిపై రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు స్పందించకపోవడాన్ని బట్టి రైతుల పట్ల సీఎం కేసీఆర్‌ చిత్తశుద్దిని శంకించాల్సివస్తుందన్నారు.


రాస్తారోకోలతో రహదారులపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి.. వివిధ పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో విజయవాడ జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకోలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, డీజీ నర్సింహారావు, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ, ఐద్వా కార్యదర్శి మల్లు లక్ష్మి, కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్‌ డిపో వద్ద హైవేపై ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌ బోస్‌ తదితరుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఖమ్మం బైపాస్‌ రోడ్డులో నిర్వహించిన రాస్తారోకోలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు.  


గద్వాల జిల్లాలో ముందస్తు అరెస్టులు.. 

జోగుళాంబ గద్వాల జిల్లాలో రాస్తారోకోలు నిర్వహించకుండా ఆయా పార్టీల నేతలను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టులు, హౌస్‌ అరెస్టులు చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్‌ కిసాన్‌ ఖేత్‌ జాతీయ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, జగిత్యాలలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నల్లగొండ జిల్లాల్లో  రాస్తారోకోల్లో కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T08:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising