కాంగ్రెస్‌లో క్రమశిక్షణ రగడ
ABN, First Publish Date - 2022-01-01T00:10:27+05:30
కాంగ్రెస్‌లో క్రమశిక్షణ రగడ జరుగుతోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఖరిపై క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి జగ్గారెడ్డి కౌంటరిచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ రగడ జరుగుతోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఖరిపై క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీకి రాసిన లేఖపై మీడియా ఎదుటే వివరణ ఇచ్చానని జగ్గారెడ్డి తెలిపారు. ఆ లేఖ ఎలా లీక్ అయిందో తనకు తెలియదని, ఈ లేఖపై మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. లేదా మీడియా వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. క్రమశిక్షణ పాటించని పీసీసీని క్రమశిక్షణలో తీసుకోవాలని చిన్నారెడ్డికి తెలీదా అని నిలదీశారు. క్రమశిక్షణ కమిటీ ఫస్ట్ రేవంత్‌రెడ్డిని పిలిచి.. తర్వాత తనను పిలవాలని, తప్పకుండా హాజరవుతానని జగ్గారెడ్డి తెలిపారు.
Updated Date - 2022-01-01T00:10:27+05:30 IST