ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3కోట్ల బిల్లు మాఫీ చేసిన దుబాయి ఆస్పత్రి!

ABN, First Publish Date - 2021-09-18T08:49:24+05:30

ఆయనది వారి దేశం కాదు. ప్రముఖ వ్యక్తి కూడా కాదు.. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ఉద్యోగి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నిమ్స్‌లో చేరిన 24 గంటల్లోనే బిల్లు కట్టాలని సతాయింపు
  • జగిత్యాల వ్యక్తి కోమాలోకి వెళ్లడంతో ఆర్నెల్లకుపైగా చికిత్స
  • విమానంలో హైదరాబాద్‌కు.. సాయంగా దుబాయి నర్సు


(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆయనది వారి దేశం కాదు. ప్రముఖ వ్యక్తి కూడా కాదు.. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ఉద్యోగి. దేశం కాని దేశంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైతే అక్కడి ఆస్పత్రి మెరుగైన చికిత్సను అందించింది. వైద్యానికి ఏకంగా రూ.3 కోట్ల బిల్లు అయితే అంతా మాఫీ చేసింది. డిశ్చార్జి అనంతరం స్వదేశానికి వెళ్లాలనుకున్న ఆయనకు సాయంగా ఉం డేందుకుగాను ప్రత్యేకంగా ఓ నర్సును పంపింది. అయితే విమానమెక్కి స్వదేశంలో అడుగుపెట్టిన ఆయనకు మాతృగడ్డ మీద చేదు అనుభవం ఎదురైంది.


ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే బిల్లు చెల్లించాలంటూ ఆయన్ను నిర్వాహకులు డిమాండ్‌ చేశారు! కోట్లలో ఫీజు మాఫీ చేసింది దుబాయిలోని ఆస్పత్రి అయితే ఒక్కరోజు గడవకుండానే డబ్బు కట్టాలని డిమాండ్‌ చేసింది హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి. ఆ బాధితుడు, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కట్టా గంగారెడ్డి. ఆయన దుబాయిలోని ఒక చిన్న సంస్థలో పనిచేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరు 25న గంగారెడ్డి శ్వాస సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మెడిసిటీ క్లిన్‌ అనే ఆస్పత్రిలో చేరగా నరాలన్నీ దెబ్బతినడంతో శ్వాస వ్యవస్థ చెడిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఐసీయూలో ఉంచి చికిత్సనందించారు. 


కోమాలోకి వెళ్లిపోయిన గంగారెడ్డి, మళ్లీ ఆర్నెల్ల తర్వాత స్పృహలోకి వచ్చాడు. డాక్టర్‌ అసద్‌ అల్‌ సభా నేతృత్వంలో 11 మంది వైద్యుల బృందం ఆయన ఆరోగ్యపరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స ను అందించింది. గంగారెడ్డి చికిత్సకు భారత కరెన్సీలో రూ.3 కోట్లు బిల్లు అయింది. గంగారెడ్డి ఉద్యోగ సంబంధిత సమస్యతో అనారోగ్యానికి గురవ్వలేదని, ఆ మేరకు చికిత్స బాధ్యత తనది కాదని ఆయన పనిచేసే సంస్థ యజమాని చేతులెత్తేశాడు. గంగారెడ్డి అనారోగ్య సమస్య బీమా పరిధిలోకి రాదని బీమా సంస్థ పేర్కొంది. అంత మొత్తం చెల్లించే స్థోమతేమో గంగారెడ్డికి లేదు. అటు.. ఆస్పత్రి యాజమాన్యమే మో బిల్లు చెల్లించకుండా ఆయన్ను డిశ్చార్జి చేయబోమని  స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న దుబాయిలోని సామాజిక సేవకుడు గుండల్లి నరసింహా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. గంగారెడ్డి పరిస్థితి దృష్ట్యా మనవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం, రూ.3 కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతేనా.. గురువారం దుబాయి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన గంగిరెడ్డికి ప్రయాణంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్సను అందించేందుకు ప్రత్యేకంగా ఓ నర్సును పంపించింది. ఈ విమానం టికెట్ల ఖర్చును భారత రాయబార కార్యాలయం భరించింది. కాగా శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన గంగిరెడ్డి, శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యాడు. అయితే అక్కడ చికిత్సకు అవసరమైన డబ్బును చెల్లించాల్సిందిగా ఆస్పత్రి వర్గాలు డిమాండ్‌ చేశాయి. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆయన, కుటుంబసభ్యులు.. సాయం కోసం మరోసారి గుం డల్లి నరసింహాను సంప్రదించారు. అయితే దుబాయిలో తాము చేయాల్సినంత చేశామని.. కానీ తమ మాతృభూమి అయిన తెలంగాణలో తాము నిస్సహాయులం అని ఆయన వాపోయారు.  

Updated Date - 2021-09-18T08:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising