ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓరుగల్లులో ఎన్నికల హోరు

ABN, First Publish Date - 2021-04-27T09:32:40+05:30

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కిషన్‌రెడ్డి, రేవంత్‌ సుడిగాలి ప్రచారం
  • నగరమంతా చుట్టేసిన టీఆర్‌ఎస్‌ మంత్రులు 


హన్మకొండ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచారానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలంతా రంగంలోకి దిగా రు. మంగళవారం సాయంత్రానికి ప్రచారం గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం నగరంలో పలు పార్టీలకు చెందిన కీలక నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రు లు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పక్షాన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరంగల్‌ను వరదల రహితరంగా మారుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 


గ్రేటర్‌ హైదరాబాద్‌ను తలపించే రీతిలో వరంగల్‌ మహా నగరాన్ని తీర్చి దిద్దేందుకు 50 ఏళ్ల బృహత్‌ ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఆరు నెలల్లో పరిహారం చెల్లిస్తామని చెప్పారు. వరంగల్‌లో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని, చెత్తపన్నును సగానికి తగ్గిస్తామని ప్రకటించారు. పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఉండడం కాంగ్రెస్‌ కృషేనని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. వ్యాగన్‌ ఓవరాలింగ్‌ ఫ్యాక్టరీ విషయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం లో వరంగల్‌ రెండో రాజధాని కాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేసే యోచన బీజేపీ నేతలకు లేదన్నారు. కేసీఆర్‌ పాలనకు అవార్డులు ఇచ్చేది బీజేపీ వాళ్లేనని రేవంత్‌ చమత్కరించారు.


నేటితో ప్రచారానికి స్వస్తి

ఈ నెల 30న పోలింగ్‌ జరిగే గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు తదితర మునిసిపాలిటీల పరిధిలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగుస్తుంది. కరోనా వ్యాప్తి తీవ్రం కావడంతో 72 గంటల ముందే  ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ఆదేశించారు. మద్యం దుకాణాలూ బంద్‌ కానున్నాయి. 

Updated Date - 2021-04-27T09:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising