ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టు పురుగుల పెంపకానికి ‘ఉపాధి’

ABN, First Publish Date - 2021-04-12T08:38:46+05:30

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పట్టు పురుగుల పెంపకాన్ని (మల్బరీ తోటల) చేపట్టనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
  • చేనేత, జౌళి శాఖతో గ్రామీణాభివృద్ధి శాఖ సంయుకత కార్యాచరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పట్టు పురుగుల పెంపకాన్ని (మల్బరీ తోటల) చేపట్టనున్నారు. వీలైనంత మేరకు వీటిని పెంచేలా కార్యాచరణను రూపొందించుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సూచించింది. ఏడేళ్ల క్రితమే దీనిపై కేంద్రం ప్రణాళికలను రచించినా ఆశించిన పురోగతి కనిపించలేదు. ఇప్పుడు మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఆదేశాలిచ్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖతో కేంద్ర చేనేత, జౌళి శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. దేశంలో 26 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 75 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పట్టు పరిశ్రమపై ఆధారపడి ఉన్నారన్నది కేంద్ర ప్రభుత్వ అంచనా. గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధి కల్పన ఉపాధి పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే మల్బరీ, టస్సర్‌, మగ్‌, ఎరి సిల్క్‌వామ్స్‌ (పట్టులో రకాలు) పెంపకాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేయనున్నారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన కూలీలకు ఉపాధి పథకం నుంచి వేతనాలు చెల్లిస్తారు. ఆసక్తి ఉండి జాబ్‌కార్డు ఉన్న కుటుంబాలకు 100 రోజుల పని కల్పిస్తారు. 


పట్టు పరిశ్రమకు చేయూత

మల్బరీ మొక్కల పెంపకానికి అనువైనట్లుగా కేంద్రం గుర్తించిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విస్తారంగా ఉంది. భూదాన్‌పోచంపల్లి, గద్వాల ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే పట్టు వస్ర్తాలు ప్రఖ్యాతిగాంచాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పట్టు వ స్ర్తాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలో పట్టు దారాన్ని ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పట్టు పురుగుల పెంపకానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తే ఈ ప్రాంతంలోని పట్టు వస్ర్తాల ఉత్పత్తిదారులకు సహకారం అందిచినట్లవుతుంది. పలు పథకాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తోటల పెంపకం, మొక్కల సంరక్షణలకు ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా వినియోగించుకుంటోంది. గతేడాది దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన పనులు జరగడం ఇందుకు నిదర్శనం. దాదాపు 15.37 కోట్ల పనిదినాలను పూర్తి చేశారు. వ్యవసాయ, నీటి పారుదల సంబంధిత పనులను ఇప్పటికే ఉపాధి హామీతో అనుసంధానం చేశారు. పట్టు పురుగుల పెంపకాన్ని కూడా అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలో మెరుగైన ‘ఉపాధి’  లభిస్తుందని భావిస్తున్నారు. కాగా పట్టు పురుగుల పెంపకానికి ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసే విషయమై కేంద్ర ఆదేశాలపై తెలంగాణ ప్రత్యేక ప్రణాళికలను ఇంకా సిద్ధం చేయలేదు. త్వరలోనే దీనిపై కార్యాచరణను రూపొందించవచ్చని చెబుతున్నారు. 

Updated Date - 2021-04-12T08:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising